'ఎర్రగడ్డ కపుల్ ఎటాక్' మనోహరాచారిని ఎగిరి తన్నింది ఎవరో తెలుసా?? ఆ టైంలో అతడు అక్కడికి ఎందుకు వచ్చాడంటే..!   Erragadda Couple Attack Security Guard Saves From Attack     2018-09-22   13:50:45  IST  Rajakumari K

కళ్లముందు గొడవ జరుగితే తమాషాగా చూస్తారు..మనుషులు కొట్టుకుంటే మనకెందుకులే అనుకునేవాళ్లే ఎక్కువ..అదే హత్య జరిగితే చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరు భయపడతారు..జరుగుతున్నదాన్ని ఆపాలని ఉన్న భయం కారణం చేతనే పట్టించుకోనట్టు వెళ్ళిపోతారు..రెండురోజుల క్రితం ఎర్రగడ్డలో జరిగిన ఘటన సిసి ఫుటేజ్ చూస్తే ఇదే విషయం మనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది.. ఒక అమ్మాయిని నరికేస్తున్నా రక్షించడానికి,హంతకున్ని ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు.. కానీ ఒక యువకుడు మాత్రం చాలా ధైర్యం చేశాడు. ప్రాణాలకు తెగించి పరిగెత్తుకొని వచ్చి హంతకున్ని తన్నాడు…ఎవరో కాని నిజంగా చాలా ధైర్యం చేసాడు కదా అని ఆ ఫుటేజ్ చూసిన ప్రతొక్కరూ అనుకున్నారు..అతనెవరో తెలిసింది.

అతడి పేరు అసద్ .. అసద్ కంటే ముందు ఒక సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి అడ్డుకోవడానికి ముందుకొచ్చారు..అయితే మనోహరాచారి కత్తితో బెదిరించడంతో వెనక్కి వెళ్లారు.. మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడు బైక్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్లి మనోహరాచారిని వెనుకవైపు నుంచి ఎగిరి ఒక తన్ను తన్ని వెళ్లిపోయాడు. అసద్ ఎర్రగడ్డలోని గుల్షన్ నూర్ బాగ్ బస్తీ వాసి అని తెలిసింది. ఫ్లోరింగ్ పని చేసే అసద్ సంఘటన జరిగిన రోజు ఆకలి అవుతుందని ఏదైనా తిందామని మిత్రుడితో కలసి గోకుల్ థియేటర్ వద్దకు వచ్చాడు. కళ్లముందు అంత ఘోరం జరుగుతుంటే చూడలేక చారిని తన్నానని, అయితే అతని చేతిలో కత్తి ఉండడంతో మళ్లీ దాడి చేయలేకపోయానని చెప్పాడు అసద్..