వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా( America ) గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారతీయులు లేకుండా అమెరికన్ టెక్ ఇండస్ట్రీ మనుగడ కష్టమేనన్నారు సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో హర్‌బీర్ కే భాటియా( Harbir K Bhatia ).పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.ఒకానొక సమయంలో సేకరించిన డేటా ప్రకారం సిలికాన్ వ్యాలీలొ 40 శాతం మంది సీఈవోలు , వ్యవస్థాపకులు దక్షిణాసియా లేదా భారతదేశానికి చెందినవారేనని ఆమె తెలిపారు.
సిలికాన్ వ్యాలీకి హబ్ అయిన శాంటాక్లారాలో వున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ .సిలికాన్ వ్యాలీ భవిష్యత్తును పెంచడానికి , అమెరికాలోని కీలక నగరాలకు చెందిన వ్యాపారవేత్తల సమూహంతో ఏర్పడింది.

సిలికాన్ వ్యాలీలో పనిచేయడానికి, సృజనాత్మకంగా వుండటానికి సౌకర్యవంతంగా వుంటుందని భాటియా అన్నారు.గూగుల్, యూట్యూబ్, గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని ఆమె ప్రశంసించారు.కృషి, ఉత్పాదకత వంటి ఉత్తమ విలువలను భారతీయులు తీసుకొస్తారని హర్‌బీర్ పేర్కొన్నారు.సిలికాన్ వ్యాలీతో భారతదేశానికి వున్న సంబంధం గురించి ప్రశ్నించగా.దాని విజయంలో ఇండియా కీలకపాత్ర పోషించిందన్నారు.

భారతదేశంలో ఇప్పటికీ ఔట్‌సోర్సింగ్ ఎక్కువగా జరుగుతోందని భాటియా గుర్తుచేశారు.టెక్ పరిశ్రమ అమెరికాలో వృద్ధి చెందుతుందని.ఇక్కడ ఒక ఉద్యోగికి ఇచ్చే వేతనంతో భారత్‌లో ముగ్గురు ఉద్యోగులAmerica’s tech industry cannot survive without Indians:SVC Chamber of Commerce CEO ను రిక్రూట్ చేసుకోవచ్చని హర్‌బీర్ అన్నారు.ఇండియా నుంచి అమెరికా కొన్ని ప్రకాశవంతమైన హృదయాలను తీసుకొస్తుందని ఆమె ఆకాంక్షించారు.టెక్, అగ్రికల్చర్, హెల్త్ కేర్ ఇలా ఏ వృత్తిలోనైనా భారతీయులు రాణిస్తారని హర్బీర్ భాటియా పేర్కొన్నారు.