కోవై సరళ( Kovai Sarala ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి లేడీ కమెడియన్ గా ( Lady Comedian ) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోవై సరళ.
అయితే ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించి నటిగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది.అటు సోషల్ మీడియాలో ఇటు సినిమాల్లో కనిపించడమే మానేసింది.
ఇకపోతే బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్లో ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచాయి.
తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను బాగా నవ్వించింది కోవై సరళ.అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్( Baak Movie ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమన్నా,( Tamanna ) రాశిఖన్నా( Raasi Khanna ) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది.
ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఒక షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఒకప్పుడు కోయం బత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట.సరళ కోయం బత్తూరులోనే( Coimbatore ) ఉండడంతో కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చింది సరళ.ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు.
అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని.ఒక సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.
మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది.
అక్కడ ఒక పాట షూటింగ్ జరుగుతోంది.అందరూ వచ్చారు.ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి.
నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశాను.ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్.
ఆర్టిస్టులంతా వచ్చారు.నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది.
దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది.అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను.
మా నాన్న గారిని చివరి చూపు చూసుకోలేకపోయాను.బంధువులంతా నన్ను విమర్శించారు.
నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు.అసలు విషయం వాళ్లకు తెలియదు అని కోవై సరళ ఎమోషనల్ అయింది.