టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నటువంటి అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) ఇటీవల హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వేడుకలో భాగంగా ఈయన చేసినటువంటి కామెంట్లు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి అనే సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఐపీఎల్ ( IPL ) మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది యువత ఐపిఎల్ మ్యాచ్ కి పరిమితమయ్యారే తప్ప సినిమాలు చూడటానికి ఆసక్తి చూపలేదు దీంతో ప్రస్తుతం విడుదలవుతున్న సినిమా కలెక్షన్లపై ఐపీఎల్ ప్రభావం భారీగా చూపుతోంది.
ఇక ఇదే విషయం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేవి మునిగిపోవు సాయంత్రం అలా థియేటర్లకు వచ్చి సినిమాలను చూడండి.మొబైల్ ఫోన్లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.
దీనితో నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.సినిమాల కంటే ఐపీఎల్ మ్యాచ్ బెటర్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ చూడకుంటే కొంపలేవి మునిగిపోవు మన సినిమాలు చూడకపోతే కొంపలు మునిగిపోతాయా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.ఇలా తన గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ జరగడంతో మరొక ఈవెంట్లో ఈ విషయం గురించి స్పందించిన అనిల్ రావిపూడి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు.ఐపీఎల్ సీజన్ లో సినిమా కలెక్షన్స్ గురించి ఓ డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడా.ఆయన చెప్పిన విషయాన్ని వివరించే క్రమంలో ఫ్లో లో ఐపీఎల్ గురించి ఆ మాట అన్నా.
అపార్థం చేసుకోవద్దు అంటూ ఈయన ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేశారు.