యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) పుట్టినరోజుకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది.తారక్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల నుంచి పుట్టినరోజున అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలతో పాటు మరో రెండు క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. వార్2( War2 ) సినిమా నిర్మాతల నిర్మాణంలో ఎన్టీఆర్ సోలో హీరోగా ఒక సినిమాకు సంబంధించి ప్రకటన రానుందని తెలుస్తోంది.
అదే సమయంలో హారిక హాసిని బ్యానర్ లో తారక్ త్రివిక్రమ్ కాంబో సినిమాకు సంబంధించి ప్రకటన రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఎన్టీఆర్ పుట్టినరోజున ( NTR Birthday )ఈ రెండు ప్రకటనలు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ రెండు ప్రకటనలు నిజంగా వస్తాయో లేదో తెలియాలంటే మాత్రం మే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.మే 20వ తేదీన తారక్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు మాత్రం ఉండబోతున్నాయని తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే తారక్ ఫ్యాన్స్ కు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే.తారక్ 2024 ఎన్నికలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటూ తన సినిమాల ఔట్ పుట్ మరింత బెటర్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దేవర సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని తారక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.దేవర మూవీ రిలీజ్ కు మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది.
ఈ 5 నెలల్లో దేవర సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా ప్రణాళికలు ఉంది.ఈ నెల 20వ తేదీన దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందేమో చూడాల్సి ఉంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందించడంతో ఇతర భాషల్లో సైతం ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.