ముసలోడే కానీ మహానుభావుడు : అందమైన బ్యాంక్ ఎంప్లాయ్ తో ప్రేమలో పడ్డ వృద్ధుడు.. చివరికి...

ఈ మధ్యకాలంలో కొందరు ప్రేమ మరియు కామ మైకంలో పడి వావి వరసలు మరియు వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ చిక్కులను కొనితెచ్చుకుంటున్నారు.

అయితే తాజాగా 73 సంవత్సరాల కలిగినటువంటి ఓ వ్యక్తి 25ఏళ్ల యువతిపై మనసుపడి ఆమెను పెళ్లి చేసుకునేందుకుగాను ఏకంగా కోటి రూపాయలకు పైగా ఇచ్చి, చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను సంప్రదించిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే జెరాన్ డిసౌజా అనే 73 సంవత్సరాల కలిగిన వృద్ధుడు స్థానిక నగరంలో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే జెరాన్ డిసౌజా భార్య కాలం చేయడంతో గత కొద్ది కాలంగా ఒంటరిగా ఉంటున్నాడు.

దీంతో ఈ మధ్య జెరాన్ డిసౌజా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.దీంతో ఇటీవల తనకు సంబంధించిన ఓ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసేందుకు బ్యాంకు కి వెళ్ళాడు.

ఈ క్రమంలో ఎర్రగా, అందంగా ఉన్న ఓ బ్యాంక్ ఎంప్లాయిపై మనసు పారేసుకున్నాడు.దీంతో బ్యాంక్ ఎంప్లాయ్ కూడా వృద్ధుడి అకౌంట్ లో ఉన్న డబ్బులు చూసి లేని ప్రేమను నటించ సాగింది.

Advertisement

దీంతో ఇంకేముంది ఎక్కడికెళ్లినా ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాళ్ళు.ఈ క్రమంలో తన ప్రియురాలి అడిగిందని జెరాన్ డిసౌజా ఏకంగా ఒక కోటి 30 లక్షల రూపాయలు ఇచ్చాడు.

అనంతరం తాను ప్రేమ కోసం ఏమైనా చేస్తానంటూ పెద్ద పెద్ద డైలాగులు కూడా కొట్టాడు.ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ తన ప్రియురాలిని కలిసేందుకు ఫోన్ చేశాడు.

కానీ తన ప్రియురాలి ఫోన్  స్విచ్ ఆఫ్ వచ్చింది.దీంతో ముసలి ప్రాణం తట్టుకోలేక ఏం జరిగిందోనని తన ప్రియురాలు ఉంటున్న ఇంటికి కూడా వెళ్లి చూశాడు.

కానీ అప్పటికే ప్రియురాలు కోట్ల రూపాయల డబ్బు తో చెక్కేసింది.దీంతో వృద్ధుడు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని వాపోయాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అంతేగాక ఎలాగైనా తన ప్రియురాలిని కనిపెట్టి తన డబ్బులను తనకు ఇప్పించాలని కోరుతున్నాడు.దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

అంతేకాక ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లికి కొంతమంది వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారని అందువల్లనే ఇలాంటి చిక్కులు వస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఆధారంగా "ముసలాడే కానీ మహానుభావుడు" అంటూ మీమ్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు