అవసరం మనుషులని ఏమైనా చేయిస్తుందని, అంతేగాక అవసరం ఉన్న వారు తమ పని జరిగేందుకు ఎలా అయినా మారిపోతారని అప్పుడప్పుడు కొందరు నిరూపిస్తున్నారు.దీనికితోడు ప్రస్తుతం జనరేషన్లో కొంతమంది డబ్బులే శ్వాసగా జీవిస్తున్నారు.
దీంతో క్రమక్రమంగా మానవత్వ విలువలకు డబ్బు చాలా దీటుగా పోటీ ఇస్తోంది.అదేదో సినిమాలో చెప్పినట్టు “డబ్బుంటే నూటికి 99 శాతం పనులు పూర్తవుతాయని కానీ సరిగ్గా డబ్బులు ప్రయత్నిస్తే 100కి 100 శాతం పనులు కూడా పూర్తవుతాయని” ప్రస్తుత కాలంలో నిరూపితమవుతుంది.
అయితే భర్తతో సుఖంగా జీవించాలని పలు వ్యాపారాలను మొదలు పెట్టి చివరికి నష్టాలు చవి చూడడంతో ఓ మహిళ ఏకంగా అప్పులు తీర్చేందుకు గాను పోర్న్ స్టార్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే బ్రాందీ లవ్. ఇంటర్నెట్ మాధ్యమాలలో నీలి చిత్రాలు చూసేవారికి ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.బ్రాందీ లవ్ 1973 సంవత్సరంలో మార్చి 29వ తారీఖున నార్త్ కరోలినా ప్రాంతంలో జన్మించింది.అయితే అప్పటికే మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన బ్రాందీ లవ్ ఎలాంటి ఆటుపోట్లు, కష్టాలు లేకుండానే పెరిగింది.23 ఏళ్ల వయసు రాగానే క్రిస్ ఫొటోస్కి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్ళైన మొదట్లో వీరిద్దరి కాపురం ఎంతో అన్యోన్యంగా ఉండేది.ఆ తర్వాత కుటుంబ పోషణ నిమిత్తమై ఇద్దరూ కలిసి ఓ వ్యాపారం మొదలు పెట్టారు.కానీ అనుకోకుండా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.దీంతో కుటుంబ పోషణ భారంగా మారిపోయింది.
దీనికితోడు అప్పులిచ్చిన వాళ్ళు ఒత్తిడి కూడా పెరిగింది.ఇదే సమయంలో తన భర్త క్రిస్ ఫొటోస్కి కూడా అనారోగ్యం పాలయ్యాడు.
దీంతో బ్రాందీ లవ్ కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించేందుకుగాను ఏ మహిళా చేయనటువంటి సాహసాన్ని చేసింది.అప్పటికి తన వద్ద కేవలం తన శరీరం తప్ప పోగొట్టుకోవడానికి ఇంకేమీ లేదు.
దీంతో తెలిసిన వారి ద్వారా నీలి చిత్రాలలో నటిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని తెలుసుకుంది.దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే నీలి చిత్రాల వెబ్ సైట్లు మరియు నీలి చిత్రాలు తెరకెక్కించే సంస్థలను సంప్రదించి తాను కూడా నటిస్తానని ఒప్పందం కుదుర్చుకుంది.
శృంగార తారగా కెరియర్ మొదలు పెట్టిన కొద్ది కాలంలోనే బాగానే ఊపందుకుంది.అయితే కుటుంబ పోషణ నిమిత్తమై తన భార్య అలాంటి పని చేసేందుకు సిద్ధపడినందుకుగాను బ్రాందీ లవ్ భర్త ఆమెను అర్థం చేసుకుని బాగానే చూసుకుంటున్నాడు.
కాగా ప్రస్తుతం బ్రాందీ లవ్ అమెరికన్ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తోంది.