ఆస్పిరిన్( Aspirin 0 అనేది అనేక రకాల నొప్పి, వాపును నయం చేయడానికి ఉపయోగించే పాపులర్ మెడిసిన్.అయితే, తాజా అధ్యయనం ప్రకారం, ఆస్పిరిన్‌ను తీసుకోవడం వల్ల మెదడులో రక్తస్రావం పెరుగుతుందని తేలింది.
ఆ అధ్యయనాన్ని యునైటెడ్ స్టేట్స్‌లో 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 19,144 మంది వృద్ధులపై 5 ఏళ్ల పాటు నిర్వహించారు.పరిశోధకులు స్టడీలో పాల్గొన్న వారిలో సగం మందికి రోజూ తక్కువ మోతాదులో ఆస్పిరిన్ ఇచ్చారు, మరికొందరికి ప్లేసిబో ఇచ్చారు.

తర్వాత రికార్డ్ చేసిన డేటాను విశ్లేషించారు.ఆస్పిరిన్ తీసుకున్న వ్యక్తుల మెదడు( Brain )లో రక్తస్రావం ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు, అయితే స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం మాత్రం తక్కువగా ఉందని గుర్తించారు.పరిశోధకులు ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల మెదడులో రక్తం పలుచగా మారి రక్తస్రావం పెరగడానికి కారణమవుతుందని చెప్పారు.అయితే, ఆస్పిరిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని అన్నారు.

కాబట్టి ఆస్పిరిన్ తీసుకోవాలని భావిస్తే, వైద్యుడిని సంప్రదించి మీకు ఎంత మోతాదు అవసరమవుతుందో తెలుసుకోవాలి.సూచించిన డోసేజ్ ప్రకారమే వాటిని వాడాలి.మాములుగా ఆస్పిరిన్ మాత్రలను యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పి నివారణ కోసం వాడతారు.తలనొప్పి( Headache ), పంటి నొప్పి, కీళ్ల నొప్పి, జ్వరం తగ్గడానికి, గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి కూడా దీనిని వాడతారు.
అయితే, ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని అతిగా తీసుకోవడం ప్రమాదకరమని లేటెస్ట్ స్టడీ చెబుతోంది.ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే వారు ఆస్పిరిన్ వల్ల రక్తస్రావం, రక్తహీనతకు ఎక్కువగా గురవుతారని హెచ్చరిస్తోంది.
హోమియోపతి, ఆయుర్వేదం ఏ మందులైనా సరే అతిగా తీసుకుంటే అనర్థాలకు దారి తీస్తాయి.అందుకే టాబ్లెట్స్ వాడే విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ల సలహాల మేరకే నడుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.