బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వస్తున్న పెద్ది సినిమాకు( Peddi Movie ) సంబంధించిన గింప్స్ గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది.ప్రేక్షకులందరిని మెప్పించినప్పటికి రామ్ చరణ్ ఇంతకుముందు రంగస్థలం లో ఎలాంటి లుక్స్ తో అయితే కనిపించాడో ఈ సినిమాలో కూడా అలాంటి లుక్సే మెయింటైన్ చేశాడు.
ఇక మొత్తానికైతే ఇది రంగస్థలం సినిమాను మించి ఈ మూవీ ఉంటుందా లేదంటే రంగస్థలం లానే ఉంటుందా? అనే అనుమానాలైతే అయితే వ్యక్తమవుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సినిమాలను చేయడంలో కూడా సుకుమార్ ని ఫాలో అవుతున్నాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో తన మార్కు ను చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే పాన్ ఇండియాలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఇకమీదట ఆయన కూడా స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోతాడు.
లేకపోతే మాత్రం బుచ్చిబాబు డైరెక్టర్ గానే కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి.మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక భారీ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక రామ్ చరణ్ హీరోగా ఈ సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు.ఇకమీదట సినిమాల విషయంలో కాస్త లేట్ అయిన పర్లేదు కానీ సూపర్ సక్సెస్ లను సాధించే సినిమాలను మాత్రమే చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళ లైఫ్ ఎలా మారబోతోంది అనేది…
.