ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే.చంద్రబాబు( Chandrababu Naidu ) జైల్లో ఉన్నప్పుడూ పవన్ పొత్తును కన్ఫర్మ్ చేశారు.
అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత జైల్లో ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న.ఎన్నికలు దగ్గర పడుతునన్న వేళ ప్రచారంలో వేగం పెంచాల్సి ఉంటుంది.
మొన్నటి వరకు పాదయాత్ర, పర్యటనలు వంటి కార్యక్రమాలతో టీడీపీ యమ దూకుడు ప్రదర్శించింది.కానీ ఊహించని విధంగా చంద్రబాబు జైలుపాలు కావడంతో ప్రస్తుతం టీడీపీ అన్నీ కార్యక్రమాలను హోల్డ్ లో ఉంచింది.
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Varahi Yatra-Politics Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Varahi Yatra-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-Naidu-tdp-pawan-kalyan-bjp-varahi-yatra.jpg)
అటు పవన్ కూడా ఆ మద్య వారాహి యాత్రతో నానా హడావిడి చేశారు.ఇప్పటికే మూడు విడతలు పూర్తి చేసుకున్నా వారాహి యాత్ర.త్వరలో నాల్గవ యాత్రకు పవన్( Pawan kalyan ) సిద్దేయమౌతున్నారని టాక్.అయితే ఇకపై ఇరు పార్టీలు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టిన కలిసే చేయాలనే భావన ఉన్నాయట టీడీపీ జనసేన పార్టీలు.
ఎందుకంటే అధికారికంగా పొత్తు కన్ఫమ్ కావడంతో విడివిడిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంవల్ల ప్రజల్లో పొత్తుపై అవగాహన సన్నగిల్లే అవకాశం ఉందని, కలిసి ప్రచార కార్యక్రమాలు చేస్తే బలమైన మిత్రాపార్టీలుగా ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవచ్చనే ప్లాన్ లో ఉన్నాయట టీడీపీ జనసేన పార్టీలు.
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Varahi Yatra-Politics Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Varahi Yatra-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-Naidu-tdp-pawan-kalyan-bjp-varahi-ap-politics-jana-sena.jpg)
బీజేపీ జనసేన పార్టీలు( Jana sena ) పొత్తులో ఉన్నప్పటికి ఈ రెండు పార్టీలు కలిసి ఇంతవరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేయలేదు.దాంతో ఆ రెండు పార్టీల మద్య పొత్తు నామమాత్రమే అనే భావన మెజారిటీ ప్రజల్లో నెలకొంది.అందుకే అలాంటి భావన టీడీపీ జనసేన విషయంలో రాకూడదని భావిస్తున్నాయట.
అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికి ప్రచారంలో మాత్రం వేగం తగ్గించకూడదని టీడీపీ డిసైడ్ అయిందట.ఇకపై పవన్ చేసే ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు కూడా పలు పొందేలా వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరి ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న టీడీపీకి పవన్ అండ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.