నితీష్ ప్లేట్ పిరాయిస్తున్నారా?

అధికార భాజాపాకు వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇం.డి.యాకు మూల స్తంభం గా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి జేడీయు అధినేత నితీష్ కుమార్( Nitish Kumar ) ఇండియా కూటమికి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలో( NDA Alliance ) చేరబోతున్నట్లుగా గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ ఊహ గానాలకు ఊతమిచ్చిన వార్త ఏమిటంటే ఇటీవల జరిగిన జి-20 సమావేశాలకు భారత్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే.

 Will Nitish Kumar Going To Join Nda Alliance Details, Nitish Kumar , Nda Allianc-TeluguStop.com

జి 20 లో పాల్గొన్న విదేశీ అధ్యక్షులకు కీలక అధికారులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా విందు ఇచ్చారు.ఆ విందులో కార్యక్రమం లో నితీష్ కుమార్ కూడా పాల్గొనడంతో నితీష్ యూటర్న్ తీసుకోబోతున్నారని, ఇండియాకూటమి లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు చెలరేగాయి.

Telugu Amit Shah, Cm Nitish Kumar, Congress, Summit, India Alliance, Nda Allianc

అంతేకాకుండా వివిధ టీవీ జర్నలిస్టుల మీద ఇండియా కూటమి విధించిన బ్యాన్ ని కూడా నితీష్ కుమార్ తప్పు పట్టడంతో ఆయన ఎన్డీఏ దారిలో పయనమవుతున్నారంటూ అనేక విశ్లేషణలు వినిపించాయి.అయితే వీటన్నిటిని ఆయన కొట్టిపాడేశారు.భాజపా ( BJP ) వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న తాను పార్టీ మారతానని వార్తలు రావడం హాస్యాస్పదమని చెప్పిన ఆయన, తాను ఎప్పటికీ అలాంటి పనులు చేయబోనంటూ స్పష్టం చేశారు.అవన్నీ చెత్త మాటలు, ట్రాష్ అంటూ కొట్టి పడేసారు.

మరోవైపు బిజెపి కి కూడా నితీష్ ను తాము చేర్చుకునేదే లేదంటూ ప్రకటనలు ఇస్తుంది.

Telugu Amit Shah, Cm Nitish Kumar, Congress, Summit, India Alliance, Nda Allianc

ఆ పార్టీ సీనియర్ నేత సుశీల్ మోదీ( Sushil Modi ) మాట్లాడుతూ ఒకవేళ నితీష్ భాజపాలో చేరతానన్నా తాము చేర్చుకోమని ,బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన నితీష్ కుమార్ తో జట్టు కట్టేదే లేదని ఇప్పటికే తమ అగ్ర నేత అమిత్ షా( Amit Shah ) ఈ విషయాన్ని మాకు స్పష్టం చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు.దాంతో గత రెండు రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయ్యింది .ఏది ఏమైనా ప్రధానమంత్రి పదవి పై ఎడతెగని చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నితీష్ లాంటి నేత యూటర్న్ తీసుకుంటే మాత్రం అది ఇండియా కూటమి కి అతిపెద్ద ఎదురు దెబ్బ అవుతుందని చెప్పడంలో ,మాత్రం సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube