అధికార వైసీపీ పెట్టుకున్న లక్ష్యాలక క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.పార్టీలో క్రమ శిక్షణ ఉందని ఎవరూకట్టు తప్పడం లేదని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ స్థాయి లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
పార్టీలో పదవులు దక్కనివారు ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించిన వారు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు.అయితే వీరిలో కొందరికి మాత్రమే గుర్తింపు, పదవులు దక్కా యి.మిగిలిన వారికి మాత్రం దక్కలేదు.ఈ పరిణామంతో వారంతా ఫైర్ అవుతున్నారు.
మరో వైపు వైసీపీ సర్కారు ఏర్పడి ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్నాయి.దీంతో ఇక, తమకు పదవులు దక్కడంపైనా కొందరు నాయకులు సందేహాలతో కాలం గడుపుతున్నారు.ఈ నేపథ్యానికితోడు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు కూడా కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారు.మిగిలిన వారిపై ఆదరణ లేకుండా పోయింది.
మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం లభిస్తోంది.ఈ పరిణామాలు వైసీపీలో క్షేత్రస్థాయి నేతలను, కేడర్‌ను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
అవకాశం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారనేది వాస్తవం.
అయితే కొన్నాళ్లుగా ఈ అసంతృప్తులపై వార్తలు వస్తున్నా తమను కూడా గుర్తించాలనే డిమాండ్లు వినిపించినా అధినాయక త్వం మాత్రం లెక్కచేయలేదు.
ఎవరినీ పట్టించుకోలేదు.దీంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 250 పంచాయతీ ల్లో అందునా కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మండలాల్లో రెబెల్స్ రంగంలోకి దిగారు.
వీరంతా నిన్న మొన్నటి వరకు వైసీపీ జెండా మోసిన వారే.అయితే గుర్తింపు లేకపోవడం వారిని కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచారు.

పైకి వీరి సంఖ్య వందలోపు ఉంటుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రకటించారు.కానీ.నిజానికి ఈ సంఖ్య 250 వరకు ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు.మరి వీరినిఎలా బుజ్జగిస్తారో చూడాలి.ఇదే పరిణామం రేపు కార్పొరేషన్లు.మునిసిపాలిటీల్లో ఉంటేకీలక కార్పొరేసన్లలో వైసీపీ గెలుపు ప్రశ్నార్థకమే అంటున్నారు.
మరి ఏం చేస్తారో చూడాలి.