ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు ఎక్కువ మంది కోరుకునే ఆంశం పవన్ కళ్యాణ్ సీఎం కావాలని.కానీ గత ఎన్నికల్లో మాత్రం ఆయన ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.
వైసీపీ పార్టీ ఎవరూ ఊహించని రీతిలో 151 స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటింది.రోజులు గడిచిపోయాయి.
మరలా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి.ఇప్పటి నుంచే పార్టీల 2024 ఎన్నికల కోసం బరిలో నిలుస్తున్నాయి.
టీడీపీ కూడా తాము ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసెంబ్లీలో శపథం చేశారు.
సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించేశారు.దీనికోసమైనా టీడీపీ గెలవాలని పట్టుదలగా ఉంది.
అదే సమయంలో జనసేన కూడా గట్టి పోటీనిస్తుంది.ఎలాగైనా సరే ఈ సారి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సీఎం కుర్చీలో చూసేందుకు జన సైనికులు పెద్ద ప్లానే వేశారు.
తాము వేసిన ప్లాన్ గనుక వర్కౌట్ అయితే పవన్ కళ్యాణ్ ని సీఎంగా చడడం తప్పని సరి అంటున్నారు.ఇంతకీ జనసైనికులు వేసిన ప్లాన్ ఏంటంటే.
ప్రస్తుతం టీడీపీ జనసేనతో పొత్తుకు ప్రతిపాదన పంపింది.ఎలాగైనా సరే ఈ సారి వైసీపీని గద్దె దించాలని భావిస్తోంది.
అందుకోసమే టీడీపీ పార్టీ ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవడం లేదు.ప్రస్తుతం ఇదే జనసేనకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.
టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కానీ సగం సీట్లు మరియు సగం కాలం ముఖ్యమంత్రిగా తమ నాయకుడు ఉండేలా చూస్తేనే తాము పొత్తుకు అంగీకరిస్తామని జనసేన చెప్పే అవకాశం ఉంది.జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది.
బీజేపీ పార్టీ కూడా తమ సీఎం అభ్యర్థిగా జనసేనానినే ప్రకటించే అవకాశం ఉంది.