తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో మెప్పించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా ఎదిగిన ఆయన నందమూరి ఫ్యామిలీని ఇండస్ట్రీ లో ఒక శిఖరం లా నిలబడేలా చేశారు.
ఇక ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయి రాష్ట్రానికి సీఎం అయిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే ఎన్టీఆర్( NTR ) తర్వాత తన లెగిసిని బాలయ్య బాబు( Balakrishna ) కంటిన్యూ చేస్తూ వచ్చారు.ఇక విళ్లిద్దరి తర్వాత నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందుతున్నాడు.
నందమూరి ఫ్యామిలీ ని ఈ తరం లో ముందుకు తీసుకెళ్లే ఒకేఒక్క హీరో ఎన్టీఆర్ అని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ కి బాలయ్య బాబు కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది మనం తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం…అయితే రీసెంట్ గా చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ వెళ్లి పరామర్శించి రాకపోవడం అనేది మరోసారి వీళ్ళ మధ్య నున్న గొడవలను గుర్తు చేస్తుంది అయితే అసలు వీళ్ళ మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది ఒకసారి గనుక మనం చూసుకుంటే 2019 ఎలక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ ప్రచారానికి రమ్మని బాలయ్య బాబు , చంద్రబాబు ఇద్దరూ కలిసి అడగడం జరిగింది.అయినప్పటికీ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడంతో వీళ్ళ మధ్య దూరం అనేది పెరిగింది.

ఇక రీసెంట్ గా సీనియర్ ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీయార్ హాజరవ్వలేదు.హరికృష్ణ వాళ్ళ బ్రదర్ అయిన రామకృష్ణ( Ramakrishna ) స్వతహాగా వెళ్లి శత దినోత్సవ వేడుకలకు రమ్మని ఆహ్వానించినప్పటికీ ఆయన ఫ్యామిలీతో పాటు ట్రిప్ కు వేరే దేశం వెళుతున్నానని చెప్పి ఆ ఫంక్షన్ కి రాకుండా టూర్ కి వెళ్లిపోయాడు.అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉండడానికి కారణం వైసిపి పార్టీలో మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని( Kodali Nani ) చెప్తున్నట్టుగానే ఎన్టీఆర్ చేస్తున్నాడని బాలయ్య బాబు, చంద్రబాబు ఇద్దరూ కూడా ఎన్టీఆర్ పైన ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది…కానీ చంద్రబాబు ను ఎన్టీయార్ పరామర్శిస్తే బాగుండేది అని అందరూ అంటున్నారు…
.