సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు.ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేసిన తర్వాత దర్శకుడు చెప్పిన విధంగా మహేష్ నటిస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మహేష్ బాబుకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే.మహేష్ బాబు గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.
భవిష్యత్తు మూడు ప్రాజెక్టులు సైతం తప్పనిసరిగా విజయాలను అందుకునేలా మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఒక డైరెక్టర్ తో మాత్రం మహేష్ బాబు ఏకంగా మూడుసార్లు గొడవ పడ్డాడని సమాచారం.
టక్కరిదొంగ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో మహేష్ గొడవ పడ్డారని తెలుస్తోంది.కౌబాయ్ సినిమాలలో నటించడం ద్వారా సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో హాలీవుడ్ చిత్రాల శైలిలో తెరకెక్కిన కౌబాయ్ సినిమాలలో కృష్ణ నటించారు.కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సంచలన విజయం సాధించింది.
కృష్ణ వారసుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన టక్కరిదొంగ సినిమాలో మహేష్ కౌబాయ్ పాత్రలో నటించారు.

ఈ సినిమాతో మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకుగా ప్రశంసలను సొంతం చేసుకున్నారు.టక్కరిదొంగ సినిమాకు జయంత్ సి పరాన్జీ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు.మహేష్ కూడా కౌబాయ్ పాత్ర కావడంతో టక్కరిదొంగ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హీరోగా మహేష్ కు ఈ సినిమా 5వ సినిమా కావడం గమనార్హం.

మహేష్ ఏకంగా సంవత్సరం పాటు ఈ సినిమాకు పరిమితమయ్యారు.ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ ను డూప్ తో తీస్తానని డైరెక్టర్ చెప్పగా తానే చేస్తానని మహేష్ దర్శకునితో గొడవ పడ్డారు.బ్రిడ్జి ఎపిసోడ్ సమయంలో, క్లైమాక్స్ సమయంలో డూప్ లేకుండా నటిస్తానని మహేష్ చెప్పడంతో డైరెక్టర్ కు, మహేష్ కు మధ్య గొడవ జరిగింది.