అమ్మ, నాన్న దగ్గర రెంట్ కట్టడానికి డబ్బుల్లేవ్..విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్?

సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన నటుడిగా ఒకవైపు అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను చేపట్టారు.

 Vijay Devarakonda Talks About Pushpaka Vimanam Pre Release Event Details, Vijay-TeluguStop.com

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి చిత్రం పుష్పక విమానం. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించారు.

ఈ సినిమా నవంబర్ 12వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్లో ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తాను ఇండస్ట్రీ లోకి రావాలని ఎన్నో కలలు కన్నానని అయితే ఆ సమయంలో నిర్మాతలు దొరక్క ఎంతో ఇబ్బంది పడ్డానని నాలాంటి కష్టం ఇతరులకు రాకూడదని ఇండస్ట్రీలోకి వచ్చే వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాను నిర్మాతగా మారినట్లు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తెలియజేశారు.నాకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గ్రహించిన తమ తల్లిదండ్రులు ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోయినప్పటికీ తనకు డబ్బులు ఇచ్చి ఆడిషన్స్ కి పంపించారని ఆయన తెలియజేశారు.

Telugu Liger, Puri Jagannatth, Tollywood-Movie

ఇలా సినిమాలలోకి రాకముందు విజయ్ దేవరకొండ అంటే ఎవరు అనే విషయం మా గల్లీలో కూడా తెలియదని, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ఒక నటుడిగా నిర్మాతగా నేను ఈ వేదికపై మాట్లాడుతున్నాను.నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా పై నాకున్న కాన్ఫిడెన్స్, నాపై మీకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube