టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉన్న నటులలో బ్రహ్మాజీ( Brahmaji ) ఒకరు.వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ను పెంచుకుంటూ బ్రహ్మాజీ తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా బ్రహ్మాజీ బెంగాలీ సినిమాలో ఛాన్స్ సొంతం చేసుకోగా ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బ్రహ్మాజీ టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలు పెంచారంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న బ్రహ్మాజీ ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.సలార్ సినిమాలో( Salaar ) కీలక పాత్రలో నటించి బ్రహ్మాజీ మెప్పించారు.
ఇప్పటికే తమిళం, కన్నడ, హిందీ భాషలలో బ్రహ్మాజీ నటించగా ఒక బెంగాలీ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించి మెప్పించారు.ప్రస్తుతం భువనేశ్వర్( Bhubaneswar ) లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
బ్రహ్మాజీ తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉంటారు.బ్రహ్మాజీ వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.బ్రహ్మాజీ కెరీర్ లో ఈ సినిమా మైలురాయిగా నిలిచిపోయి బెంగాలీలో సైతం మరిన్ని సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.ఈ సినిమా బ్రహ్మాజీ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఎంఎన్ రాజ్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా రక్తిమ్ ఛటర్జీ( Raktim Chatterjee ) ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.సలార్ సినిమా వల్లే బ్రహ్మాజీ ఈ సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.బ్రహ్మాజీ తర్వాత సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బ్రహ్మాజీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి తన సక్సెస్ రేట్ ను మరింత పెంచుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
బ్రహ్మాజీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.