సక్సెస్ సాధించడమే మన లక్ష్యమైతే ఆలస్యంగానైనా సక్సెస్ మన సొంతం అవుతుందనే సంగతి తెలిసిందే.బలమైన సంకల్పం ఉంటే కెరీర్ ప లిరంగా సక్సెస్ సాధించడం, సంచలన విజయాలను సొంతం చేసుకోవడం తేలికేనని కేరళ రాష్ట్రంలోని( Kerala ) తిరువనంతపురానికి చెందిన అఖిల( Akhila ) నిరూపించడం జరిగింది.
ప్రమాదంలో చేతిని కోల్పోయినా ఒంటి చేత్తో పోరాటం చేస్తూ సక్సెస్ సాధించిన అఖిల గురించి తెలిస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.
యూపీఎస్సీ సివిల్స్ లో( UPSC Civils ) మంచి ర్యాంక్ సాధించిన అఖిల్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.
తాజాగా విడుదలైన యూపీఎస్సీ 2022 ఫలితాలలో అఖిల సత్తా చాటారు.అఖిల సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఐదు సంవత్సరాల వయస్సులో బస్సు ప్రమాదంలో అఖిల కుడి చేతిని కోల్పోయారు.ఆ తర్వాత అఖిల్ ఎడమ చేతితోనే రాయడం, పనులు చేసుకోవడం నేర్చుకున్నారు.
స్కూల్, కాలేజ్ లో టాపర్ గా నిలిచిన అఖిల ఐఐటీ మద్రాస్ లో ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలో సివిల్స్ లో 760వ ర్యాంకును అఖిల సాధించడం గమనార్హం.స్కూల్ లో ఉన్న సమయంలోనే టీచర్ కావాలని భావించిన అఖిల కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.
శారీరక లోపం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో ఆమె సక్సెస్ సాధించారు.
సివిల్స్ లో అర్హత సాధించడం వల్ల నా ఆత్మ విశ్వాసం రెట్టింపు అయిందని ఆమె చెబుతున్నారు.మన లక్ష్యం బలంగా ఉంటే సక్సెస్ సాధించడం సులువేనని సక్సెస్ దక్కే వరకు పోరాటం ఆపవద్దని ఆమె చెప్పుకొచ్చారు.అఖిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖిల కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.