అప్పుడు కిలో రూ.200.. ఇప్పుడు రూ.10 కంటే తక్కువ.. టమాటా రైతుల పరిస్థితి దారుణమంటూ?

తెలుగు రాష్ట్రాలలోని రైతులలో ఎక్కువమంది పండించే పంటలలో టమాటా( Tomato ) ఒకటి కాగా గత రెండు నెలలుగా టమాటా రేట్లు ఊహించని స్థాయిలో ఉండటంతో టమాటా కొనుగోలు చేయాలంటే కొనుగోలుదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకానొక సమయంలో కిలో టమాటా 200 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పలకడంతో టమాటాలను అమ్మి కొంతమంది రైతులు కోటీశ్వరులు అయ్యారు.

 Tomoto Prices In Ap Kurnool Market Details Here Goes Viral In Social Media , Ku-TeluguStop.com

అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతున్న టమాటా ధర తాజాగా మరింత తగ్గింది.కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్ ( Pattikonda Market )లో కిలో టమాటా కేవలం 10 రూపాయలు, అంతకంటే తక్కువ పలకడం గమనార్హం.

టమాటాల ధరలు ఊహించని స్థాయిలో తగ్గడంతో రైతులు ఫీలవుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు కోరుతున్నారు.

Telugu Kurnool, Pattikonda, Tomato, Tomato Farmers, Tomoto-Latest News - Telugu

రైతులకు గిట్టుబాటు ధరలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.మరోవైపు ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పెరుగుతున్న ఉల్లి ధరల వల్ల ఉల్లి కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితులు సైతం నెలకొన్నాయి.రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వాలు కొత్త పథకాలను అమలు చేయాల్సి ఉంది.

Telugu Kurnool, Pattikonda, Tomato, Tomato Farmers, Tomoto-Latest News - Telugu

మరోవైపు ధరలు తగ్గుతున్నా కొనుగోలుదారులు సంతోషంగా లేరు.రైతుల నుంచి కిలో రూ.10 చొప్పున టమాటాలు కొంటున్న వ్యాపారులు మార్కెట్ లో మాత్రం 40, 50 రూపాయలకు అమ్ముతున్నారు.అటు రైతులు, ఇటు కొనుగోలుదారులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు.రైతులకు, కొనుగోలుదారులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.టమాటా రైతులు తగ్గుతున్న ధరల విషయంలో ఆందోళన చెందుతున్నారు.ధరలు మరీ ఈ స్థాయిలో తగ్గుతాయని ఊహించలేదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టమాటా ధరలు తగ్గడంతో ఇతర కూరగాయల ధరలు సైతం అమాంతం తగ్గుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube