ముల్లంగి పంటO( Radish Crop )ను సాధారణ పంటగా లేదంటే అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.ముల్లంగి పంట ఎంత వేడినైనా తట్టుకోగలుగుతుంది.
ఏ పంట సాగుచేసిన అధిక దిగుబడులు సాధించాలంటే.సాగుకు మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ముల్లంగి పంట సాగులో అధిక దిగుబడి ఇచ్చే మేలు రకాల గురించి తెలుసుకుందాం.
పూస రేష్మి: ( Pusa Rashmi )
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Pusa-Rashmi-Radish-Seeds.jpg)
ఈ రకానికి చెందిన ముల్లంగిని విత్తుకోవడానికి సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది.ఒక ఎకరం పొలంలో 6 నుంచి 7 టన్నుల దిగుబడి పొందవచ్చు.
పూసా చెట్కి:( Pusa Chetki )
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Pusa-Chetki-Radish-Seeds.jpg)
ఈ రకానికి చెందిన ముల్లంగిని విత్తుకోవడానికి మార్చి- ఆగస్టు వరకు అనుకూల సమయం.విత్తిన 45 రోజులకు పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో సుమారుగా ఏడు టన్నుల దిగుబడి పొందవచ్చు.
పూసా దేశి( Pusa Desi ):
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/Pusa-Desi-Radish-Seeds.jpg)
ఈ రకానికి చెందిన ముల్లంగిని వెతుక్కోవడానికి ఆగస్టు నెల అనుకూలంగా ఉంటుంది.ఒక ఎకరం పొలంలో ఎనిమిది టన్నుల దిగుబడి పొందవచ్చు.
ముల్లంగి పంట సాగుకు చాలావరకు అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.ఇక ముల్లంగి పంటకు అందించాల్సిన పోషక ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరం పొలంలో 30 టన్నుల బాగా కుళ్ళిన FYM ని బేసల్ డ్రెస్సింగ్ జోడించాలి.120-60-120 N:P:K తో పాటు 30 కిలోల MgO పంటకు అందిస్తే సరిపోతుంది.
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/03/Techniques-for-high-yield-in-radish-cultivation.jpg)
నాణ్యమైన అధిక దిగుబడి పొందాలంటే.మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.పొలంలో కలుపు అధికంగా పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.నేలలోని తేమశాతాన్ని బట్టి వారం రోజులకు ఒకసారి పంటకు నీటి తడులు అందించాలి.ఇక ఏవైనా చీడపీడలు( Pests ) లేదంటే తెగుళ్లు ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలిదశలోనే అరికట్టి పంటను సంరక్షించుకుంటే అధిక దిగుబడి పొంది మంచి ఆదాయం అర్జించవచ్చు.