తెలంగాణ కాంగ్రెస్ లో మరో మరో వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.ముఖ్యంగా లోక్ సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో వివాదాలు ఏర్పడుతున్నాయి.
మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నేతలకు టిక్కెట్ విషయంలో ప్రాధాన్యం కల్పించడంపై పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు .ముఖ్యంగా రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ , సునీత మహేందర్ రెడ్డి లకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) కు టిపిసిసి నేత నిరంజన్ లేక రాశారు.కాంగ్రెస్ ఇప్పటి వరకు లోక్ సభ కు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది .
![Telugu Aicc, Congressmp, Danam Nagendar, Niranjan, Patnamsuneetha, Pcc, Revanth Telugu Aicc, Congressmp, Danam Nagendar, Niranjan, Patnamsuneetha, Pcc, Revanth](https://telugustop.com/wp-content/uploads/2024/03/pcc-chief-revanth-reddy-Patnam-Suneetha-Mahender-Reddy-aicc-congress-mp-tickets-niranjan-sunitha-reddy.jpg)
అందులో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చినవారే కావడంతో, పాత కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను దానం నాగేందర్ కు , చేవెళ్ల టికెట్ ను గడ్డం రంజిత్ రెడ్డికి, మల్కాజ్ గిరి టికెట్ ను పట్నం సునీత మహేందర్ రెడ్డి( Patnam Suneetha Mahender Reddy ) కి ఇవ్వడం పై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.దీనిపై మరోసారి పునః సమీక్షించాలనే డిమాండ్ కాంగ్రెస్ లో పెరుగుతోంది.ఈ మేరకు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ నేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు లేఖ రాశారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. రెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను మాల సామాజిక వర్గానికి చెందినవారికి టికెట్ ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
![Telugu Aicc, Congressmp, Danam Nagendar, Niranjan, Patnamsuneetha, Pcc, Revanth Telugu Aicc, Congressmp, Danam Nagendar, Niranjan, Patnamsuneetha, Pcc, Revanth](https://telugustop.com/wp-content/uploads/2024/03/revanth-reddy-Patnam-Suneetha-Mahender-Reddy-Lok-Sabha-tickets-aicc-congress-mp-tickets-niranjan-sunitha-reddy.jpg)
ఇతర పార్టీల నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వారికి లోక్ సభ టికెట్లు( Lok Sabha tickets ) కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపరిచినట్లే అని, వారిని నైతికంగా ఈ వ్యవహారం దెబ్బతీస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడికి లేఖ రాశారు.” తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారు.ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్ధం.
ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు కేడర్ కు ఎలాంటి సంకేతాలు పంపుతాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి.మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షించండి .ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీకి వీర విధేయులుగా ఉండే వారికి టిక్కెట్లు ఇవ్వండి ” అంటూ లేఖలు కోరారు.