పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉన్నారు.ప్రజారాజ్యం పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి చెయ్యని ప్రయత్నమంటూ లేదు.2019 ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే అయినా అవుతారని అభిమానులు ఆశించగా ఆ ఆశ కూడా నిజం కాలేదు.అయితే పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) పవన్ ను చూసిన వాళ్లు ఒకింత ఆశ్చర్యపోతున్నారు.
ప్రజలతో మమేకమవుతూ వాళ్లతో ఫోటోలు దిగుతూ పసిపిల్లలను ఎత్తుకుంటూ కొత్త పవన్ కళ్యాణ్ ప్రజలకు కనిపిస్తున్నారు.పవన్ సినిమాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండి ఈ రేంజ్ లో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ పరిస్థితులు మారేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ ఇకపై కూడా ఇదే విధంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.పవన్ పొలిటికల్ గా( Pawan Politics ) సక్సెస్ అయితే అభిమానులు ఏ స్థాయిలో సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకానొక సమయంలో పదేళ్ల పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన పవన్ పొలిటికల్ కెరీర్ పరంగా కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.అయితే రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడం ఖాయమని ఈ ఎన్నికల్లో ఆయనకు తిరుగుండదని తెలుస్తోంది.పిఠాపురంలో 91000 మంది కాపు ఓటర్లు ఉన్నారు.ఆ ఓటర్లే తనను గెలిపిస్తారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు.
ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పవన్ కు మరింత కలిసొస్తోందని చెప్పవచ్చు.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో సరైన ప్రణాళికతో ప్రచారం చేసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే మినిష్టర్( Minister ) కావడం గ్యారంటీ అని అభిమానులు ఫీలవుతున్నారు.పవన్ ఎన్నికల్లో విజయం సాధించినా సినిమాల్లో కొనసాగుతారని తెలుస్తోంది.పవన్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.