తెలుగులో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన “కొత్త బంగారు లోకం” చిత్రంలో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చెప్పిన డైలాగులు అప్పట్లో కుర్రకారుని ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ “హరిత” తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా హరిత తను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి సినిమా పరిశ్రమకి వచ్చానని, కానీ ఎప్పుడూ కూడా తన కుటుంబ సభ్యుల పరపతిని ఉపయోగించుకుని అవకాశాల కోసం ప్రయత్నించలేదని చెప్పుకొచ్చింది.అయితే తన పిన్ని అప్పట్లోనే సినిమా పరిశ్రమలో పలు హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పేదని దాంతో అప్పుడప్పుడు తాను కూడా డబ్బింగ్ థియేటర్స్ కి వెళ్లే దానినని ఈ క్రమంలో తనకి డబ్బింగ్ పై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చింది.
సరిగ్గా అప్పుడే “కొత్త బంగారు లోకం” చిత్రంలో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చిందని ఆ చిత్రం తన ప్రతిభని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిందని ఆ తర్వాత పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదని తెలిపింది.
కానీ తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన “కిక్” చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఇలియానా కి డబ్బింగ్ చెప్పానని ఈ చిత్రం తనకు ఎంతగా గుర్తింపు తెచ్చిందని చెప్పుకొచ్చింది.
అయితే ముందుగా తాను ఈ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రకు డబ్బింగ్ చెప్పాలని వెళ్లానని కానీ తన వాయిస్ నచ్చడంతో సౌండ్ ఇంజనీరింగ్ యూనిట్ సభ్యులు హీరోయిన్ కి సరిగ్గా సూటవుతుందని గుర్తించారని దాంతో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చిందని తెలిపింది.అయితే సినిమా హీరో హీరోయిన్లు కెమెరా ముందు నటిస్తారని కానీ తాము కెమెరా వెనుక తమ మాటలతో నటిస్తామని అంతే తేడా ఉంటుందని తెలిపింది.