తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష మరికాసేపటిలో ప్రారంభం కానుంది.గతేడాది అక్టోబర్ 16న జరగాల్సి ఉండగా ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రద్దు అయిన సంగతి తెలిసిందే.
33 జిల్లా కేంద్రాల్లో మొత్తం 994 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.కాగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుండగా… అభ్యర్థులను హాల్ లోపలికి ఉదయం 10.15 గంటల వరకే అనుమతి ఇస్తున్నారు.వివిధ శాఖల్లోని 503 పోస్టుల భర్తీకి గ్రూపు-1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది.