రాజకీయ బడిలో తొలి గురువు ఆయనే.. కుష్బూ కామెంట్స్ వైరల్!

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని( Teachers day )ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

 Teachersday Special Kushboo Tweet Goes Viral In Social Media, Kushboo, Politic-TeluguStop.com

ఇకపోతే రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ తొలి గురువుల గురించి స్మరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నటి కుష్బూ ( Kushboo ) సైతం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కుష్బూ సినీనటి గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె మొదట 2010లో ఖుష్బూ కరుణానిధి సమక్షంలో డీఎంకే( DMK) సభ్యత్వం పొంది రాజకీయ ప్రవేశం( Political Entry ) చేశారు.ఆ తర్వాత 2014లో డీఎంకే నుండి వైదొలగి, కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.ఇలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఈమె తిరిగి 2020 అక్టోబర్‌లో బీజేపీ( BJP )లో చేరారు.

ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ(BJP)లో జాతీయ కమిటీ సభ్యురాలిగా, మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు.

ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే సందర్భంగా ఈమె తన రాజకీయ గురువు గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.తన రాజకీయ తొలిగురువు కలైంజర్‌ను స్మరిస్తూ ట్వీట్‌ చేశారు.నా రాజకీయ బడిలో తొలి గురువు అంటూ కరుణానిధి ( Karunanidhi ) తో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కుష్బూ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube