టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ( Chandrababu Naidu Arrest )అయిన తరువాత నుంచి టీడీపీ పార్టీ( TDP pary ) అనుసరిస్తున్న విధానాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.అధినేతతను బయటకు తీసుకోచ్చేందుకు పార్టీ శ్రేణులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి చంద్రబాబు బెయిల్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
మరోవైపు పార్టీపై వ్యతిరేకత ప్రభావం పడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ నేతలు.ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తి జాతీయ మీడియాల్లోను హైలెట్ అయ్యేలా చేశారు టీడీపీ ఎంపీలు ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ కు టీడీపీ సిద్దమౌతోందట.
![Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politic Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politic](https://telugustop.com/wp-content/uploads/2023/09/JanaSena-BJP-Jagan-YSRCP-AP-AP-CM-jagan-ap-government-Chandrababu-Naidu-Arrest.jpg)
అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ ఎమ్మేల్యేలు మూకుమ్మడి రాజీనామా చేసేందుకు సిద్దమౌతున్నారతాని టాక్.ప్రస్తుతం.టీడీపీకి 23 మంది ఎమ్మేల్యేలు ఉన్నారు.ఈ 23 మంది ఎమ్మేల్యేలు రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ టీడీపీ భావిస్తున్నట్లుగా 23 మంది ఎమ్మేల్యేలు రాజీనామా చేసిన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం అయితే లేదు.ఎందుకంటే వైసీపీకి స్పష్టమైన ఎమ్మెల్యేల బలం ఉంది.
అందుకు ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామా చేసిన పెద్దగా ఉపయోగం ఉండదనేది కొందరి అభిప్రాయం.
![Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politic Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politic](https://telugustop.com/wp-content/uploads/2023/09/YSRCP-AP-AP-CM-jagan-ap-government-Chandrababu-Naidu-Arrest.jpg)
అయితే ఎమ్మెల్యేల రాజీనామాతో నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది.తద్వారా జగన్ ( CM Jagan )సర్కార్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగి చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుందనేది టీడీపీ నేతల ప్లాన్ గా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం పార్టీలో అందరూ కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అందులో కూడా క్లారిటీ లేని పరిస్థితి.
కానీ బాబు అరెస్ట్ అంశాన్ని ఎలాగైనా టీడీపీకి ఫేవర్ గా మార్చుకోవాలని ఆ పార్టీ శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు ఏపీ ఎన్నికల విషయంలో కూడా సందిగ్ధత కొనసాగుతోంది.
ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయిన తరువాత ఎన్నికల విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మరి ఈ లోగా వైసీపీని( YCP ) దెబ్బ కొట్టేందుకు టీడీపీ ఇంకెలాంటి వ్యూహాలకు సిద్దమౌతుందో చూడాలి.