ఏపీలో బిజెపి( AP BJP ) పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్లుగా ఉన్నా.ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా, మిగతా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం వంటివి ఆ పార్టీ గ్రాఫ్ ను మరింతగా తగ్గిస్తున్నాయి.
వాస్తవంగా ఏపీ బీజేపీలో ఎప్పటి నుంచో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ గ్రూపు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి.
ముఖ్యంగా టిడిపి తో పొత్తు విషయంలో ఒక వర్గం సానుకూలంగా స్పందిస్తుండగా, మరో వర్గం టిడిపితో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఆ పార్టీలో రచ్చగా మారింది.
టిడిపి తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చని.అప్పుడు పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చని, అలాగే పొత్తులో భాగంగా టిడిపి( TDP ) ఎక్కువ లోక్ సభ స్థానాలను కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందని ఒక వర్గం వాదిస్తుండగా, ఆ పొత్తుల కారణంగానే ఇప్పటి వరకు బిజెపి ఎదగలేకపోయిందని, టిడిపి బీజేపీని ఎదగకుండా చేసిందని, మరోసారి అటువంటి తప్పు ఎందుకు చేయాలని మరో వర్గం ప్రశ్నిస్తోంది.
దీంతో ఈ రెండు గ్రూపులో మధ్య ఏపీ బీజేపీ పరిస్థితి అయోమయంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందే కంటే తెలివిగా పొత్తులతో వెళ్లడమే మంచిదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( Daggubati Purandeswari ) భావిస్తున్నారు.సీఎం రమేష్ , సుజనా చౌదరి వంటి నేతలు దీనిని స్వాగతిస్తున్నారు.ఇదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి వారు తెలిపినట్లు సమాచారం.
పొత్తులతో సభలో బిజెపి స్థానాలను పెంచుకోవచ్చని మీరు అధిష్టానానికి సూచిస్తున్నారు .
ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు పెట్టుకోవద్దని మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు అధిష్టానం వద్ద రాయబారాలు చేస్తున్నారు పొత్తు పెట్టుకోవడం వల్లనే ఇప్పటివరకు ఏపీలో బిజెపి స్వయంగా ఎదగలేకపోయిందని, టిడిపిని నమ్మి మరోసారి దెబ్బతినడం ఎందుకని వారు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారట.దీంతో ఏపీ బీజేపీ విషయంలో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం పెద్దలు ఉన్నారు.