ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) చేసిన ప్రకటన రాజకీయ పార్టీల నాయకులలోనూ అభిమానుల లోనూ అనేక మిశ్రమ అనుభూతులను కలిగించినట్టుగా తెలుస్తుంది .జనసేన కార్యకర్తలలో కొంతమందికి పవన్ ప్రకటన సంతోషాన్ని కలిగిస్తే మరి కొంతమందికి తమ భవిష్యత్తు ఆశలను తుంచేసాడు అన్న బాధ కనిపించింది.
ఇదే పట్టుదల తో మరికొంత కాలం ప్రయత్నిస్తే కచ్చితం గా పవన్ ముఖ్యమంత్రి( Pawan CM ) అయ్యి ఉండేవాడని, అనవసరం గా గొప్ప అవకాశాన్ని పవన్ పొగుట్టుకున్నారన్నది ఈ వర్గం తాలూకూ బాద.తెలుగుదేశం కార్యకర్తల్లో మాత్రం పూర్తిస్థాయి ఆనందం వెల్లివిరిసింది.పవన్ లాంటి చారిష్మాటిక్ లీడర్ తమ వైపు ఉంటే ఇక ఖచ్చితంగా అధికారం తమ వైపేనని, తమ అధినేత చంద్రబాబు ఇక సీఎం గా కూర్చోవడమే తరువాయి అన్నంత ధీమా తెలుగుదేశం శ్రేణులు( TDP Leaders ) ప్రదర్శిస్తున్నారు.
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2022/06/TDP-janasena-alliance-cbn-YSRCP-AP.jpg)
మరోవైపు వైసీపీ శ్రేణులు( YCP Leaders ) అయితే తమకు పరిస్థితులు కఠినంగా మారిపోయాయని, పొత్తు తో వస్తే తమ అవకాశాలు సన్నగిల్లుతాయని ఆఫ్ ది రికార్డు ఒప్పుకుంటున్నారు.అయితే ఆన్ మీడియా గా మాత్రం పవన్ అమ్ముడుపోయారని, తన సామాజిక వర్గాన్ని తెలుగుదేశం అధినేత కాళ్ల దగ్గర బేరం పెట్టేసారని, తనని నమ్ముకున్న అభిమానుల ఆశలను వమ్ము చేశారంటూ మీడియా ముందు హడావిడి చేస్తున్నారు.అయితే పవన్ తన ప్రకటన ద్వారా మూడు పార్టీల అభిమానుల్లోనూ అనేక కొత్త ఆలోచనలను, భయాలను, సంతోషాలను ఏక సమయంలో రేకెత్తించడంలో మాత్రం విజయవంతం అయ్యారని చెప్పవచ్చు .
![Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/11/What-is-the-political-gain-of-Pawan-Kalyan-if-an-alliance-with-TDP-happens.jpg)
ఇకపై జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ( TDP Janasena Alliance )ను ఎంత మేరకు విజయవంతంగా నడిపిస్తారన్న దాన్ని బట్టి ఈ రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ ఆధారపడి ఉంటుంది.అంతేకాకుండా ప్రధానంగా సీట్ల పంపకం దగ్గర వచ్చే విభేదాలను వీరు ఎలా పరిష్కరించుకుంటారన్నదే ప్రధాన సమస్య .షరతులు లేని మద్దతు ఇచ్చిన విధంగా వ్యవహరించిన పవన్ సీట్ల సంఖ్య దగ్గర పట్టు పడతారా లేక ఈ సారికి చూసి చూడకుండా కానివ్వమంటూ శ్రేణులకు సర్ది చెప్పుకుంటారా అన్నదే అతి పెద్ద సమస్య .ఏది ఏమైనా పవన్ ప్రకటన కొంతమందికి మోదం కొంతమందికి ఖేదం కలిగించిందని మాత్రం చెప్పవచ్చు
.