టాలీవుడ్ లో కేవలం కమర్షియల్ హీరోయిన్ గానే మిగిలిపోయిన అందాల భామ తాప్సి బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత వరుసగా ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతుంది.ఆమె హవాని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు.
వరుస అవకాశాలతో తాప్సి హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది.టాలీవుడ్ లో ఎంతో కాలంగా ఉన్న రాని గుర్తింపు బాలీవుడ్ లో తాప్సికి చాలా వేగంగా వచ్చింది.
తెలుగు చిత్ర పరిశ్రమ కేవలం హీరోయిన్స్ ని అందాల ప్రదర్శనకి మాత్రమే సినిమాలో ఉపయోగిస్తారని తాప్సి లాంటి టాలెంటెడ్ యాక్టర్ వెళ్ళిన తర్వాత రుజువైంది.ఆమెలో అంత గొప్ప నటి ఉందనే విషయం తెలుగు ప్రేక్షకులు సైతం గుర్తించలేకపోవడానికి ఇక్కడ ఆమె చేసిన సెకండ్ హీరోయిన్ పాత్రలే అని చెప్పాలి.
ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ హీరోయిన్స్ కి కూడా లేని గుర్తింపు, అలాగే రెమ్యునరేషన్ పరంగా కూడా తాప్సి టాప్ చైర్ లో ఉందని చెప్పాలి.
తాప్పీ తాజాగా రశ్మీ రాకెట్ టైటిల్ తో ఓ అథ్లెట్ బయోపిక్ లో నటించింది.
అలాగే ప్రస్తుతం ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో కూడా నటిస్తుంది.ఈ సినిమా కోసం చాలా సీరియస్ గా క్రికెట్ సాధన చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బయోపిక్ లో కోసం తాప్సిని సంప్రదించినట్లు సమాచారం.టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవిత కథతో సినిమాని తెరకెక్కించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పుడు తాప్సిని తీసుకుంటే సానియా మీర్జా తరహాలో తనని తాను మార్చుకోవడంతో పాటు క్యారెక్టర్ ని సీరియస్ గా తీసుకొని నటిస్తుందని నిర్మాత రోనీ స్క్రూవాలా భావించి ఆమెని సంప్రదించినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో తాప్సి కూడా నటించడానికి ఒకే చెప్పెసిందని టాక్.
మిథాలీ రాజ్ బయోపిక్ పూర్తయిన తర్వాత సానియా మీర్జా స్టొరీపై దృష్టిపెట్టబోతున్నట్లు బోగట్టా.