ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా మారింది.ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో నటీనటులు సోషల్ మీడియా తో ఎంత దగ్గర ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇటీవల స్టార్ హీరో రానా వన్ సైడ్ లవర్ హాట్ లుక్ తో తెగ పిచ్చెక్కిస్తుంది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.
రానా నటించిన లీడర్ సినిమా లో ప్రధాన పాత్రలో నటించిన ఎన్నారై భాను ప్రియ ఆనంద్.
ఈమె లీడర్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఇక ఈ సినిమాలో భానుప్రియ రానా ను ప్రేమిస్తుంది.
కానీ రానా మాత్రం మరో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ ను ఇష్టపడతాడు.అందుకే ఆమె ఆ సినిమాలో రానా కు వన్ సైడ్ లవర్ గా మిగిలిపోతుంది.
ఇదిలా ఉంటే తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ప్రియ ఆనంద్ అంతగా గుర్తింపు అందుకోలేకపోయింది.అంతేకాకుండా యంగ్ హీరో రామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో నటించగా ఈ సినిమా అంతగా విజయం అందుకోలేదు.
ఇక తెలుగు సినిమాల్లో ఆశించినంత ఫలితం రాకపోయేసరికి తమిళ సినీ పరిశ్రమ లో అడుగుపెట్టింది.ఇక్కడ మంచి విజయాన్ని అందుకొని వరుస సినిమాలలో నటించింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
ఇక ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.మొత్తానికి ప్రియ ఆనంద్ టాలీవుడ్ లో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా.ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో బాగా బిజీ గా మారింది.
వరుస సినిమాలతో తెగ దూసుకుపోతుంది.ప్రస్తుతం భాను ప్రియా తమిళంలో రెండు సినిమాల్లో, కన్నడంలో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ఇవి కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా తెగ బిజీ గా మారింది.
తాజాగా ప్రియ ఆనంద్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేయగా.
అందులో మరింత హాట్ గా రెచ్చిపోయింది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.