స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సాధారణంగా ప్రేక్షకులు సినిమాలలో కథ, కథనంను ఇష్టపడతారు.అయితే త్రివిక్రమ్ సినిమాలలో మాత్రం మాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 Star Writer Cum Director Trivikram Srinivas First Remuneration Details Here ,tri-TeluguStop.com

అద్భుతంగా మాటలు రాస్తాడనే పేరు ఉండటం వల్ల ప్రేక్షకులు త్రివిక్రమ్ ను అభిమానంతో మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటారు.నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కాగా నేటితో త్రివిక్రమ్ 49వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.

ప్రతి సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకునిగా తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.సింపుల్ స్టోరీ లైన్ తో, ఆకట్టుకునే కథనంతో మ్యాజిక్ చేసి త్రివిక్రమ్ విజయాలను అందుకుంటున్నారు.

క్లాస్ ప్రేక్షకులను మెప్పించే మాస్ కథాంశంతో ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించడం గమనార్హం.ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్లకు పైగా త్రివిక్రమ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Telugu Rupees, Bheemla Nayak, Pawan Klayan, Writer, Tollywood-Movie

అయితే కెరీర్ తొలినాళ్లలో త్రివిక్రమ్ తీసుకున్న పారితోషికం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఎంతో ఆసక్తి ఉన్న త్రివిక్రమ్ సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.కెరీర్ తొలినాళ్లలో త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు కేవలం 2000 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం త్రివిక్రమ్ భీమ్లా నాయక్ మూవీకి రైటర్ గా పని చేస్తున్నారు.

Telugu Rupees, Bheemla Nayak, Pawan Klayan, Writer, Tollywood-Movie

భీమ్లా నాయక్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుండగా ఈ సినిమా విడుదలైన తర్వాత త్రివిక్రమ్ మహేష్ సినిమా పనులను మొదలుపెట్టనున్నారు.కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాభాల్లో వాటా కూడా తీసుకుంటూ ఉండటం గమనార్హం.త్రివిక్రమ్ ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హసిని బ్యానర్స్ లోని సినిమాలకు పని చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

త్రివిక్రమ్ సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ కావడంతో పాటు అక్కడ కూడా విజయం సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube