రంగారావు తో స్నేహం కారణం గా సర్వం కోల్పోయిన హీరో ఎవరో తెలుసా?

ఓ అర్థ శతాబ్దం క్రితం సినిమా హీరో కావాలంటే అంత ఈజీగా జరిగేపని కాదు.చక్కటి రూపం, అంతకు మించి ప్రతిభ ఉన్నా.

 Svr Friendship Spoiled Hero Harinath, Senior Ntr, Harinath, Sri Ramu,svr, Harin-TeluguStop.com

అప్పట్లో వెండి తెర మీద హీరోగా రాణించాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు.అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఓ యువకుడికి అదృష్టం కలిసి వచ్చింది.

అనుకోకుండా హీరోగా అయ్యాడు.అంతే వేగంగా హీరో అయ్యాడు.

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి పేరు పాదించుకున్నాడు.నిర్మాతలు అతడితో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపించారు.

అంతేకాదు.తెలుగు నాట అతడికి ఎంతో మంది అభిమానులు అయ్యారు.

ఆయన మరెవరో కాదు.హరినాథ్.

అయితే ఆయన చేసిన కొన్ని తప్పుల మూలంగా కెరీర్ పూర్తిగా కొలాప్స్ అయ్యింది.

కెరీర్ లో మంచి స్వింగ్ లో కొనసాగుతున్న క్రమంలోనే ఆయన విలాసాలకు అలవాటు పడ్డాడు.

నటనను పూర్తిగా వదిలేశాడు.చుట్టూ అమ్మాయిలు, మత్త పానియాలతో సరదాగా జీవితాన్ని గడిపేవాడు.

తనకు తెలియకుండానే తన కెరీర్ ను గాలికి వదిలేశాడు.ఆయన తిరిగి ఆలోచించే సమయానికే జీవితం పూర్తిగా గాడి తప్పింది.

హరినాధ్ పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్.ఆయనను ఓసారి పిలిచి మందలించాడు.చేసే పనిని గౌరవించాలని చెప్పాడు.తాను దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ ఆయనకు శ్రీరాముడి పాత్ర ఇచ్చాడు.ఈ సినిమాలో నటనతో హరినాథ్ కు మంచి పేరు వచ్చింది.అమ్మాయిల రాకుమారుడుగా మారిపోయాడు.

Telugu Harinath, Senior Ntr, Sri Ramu-Movie

నటులుగా ఎన్టీఆర్ తర్వాత హరినాథ్ బాగా స్థిరపడ్డారు.ఈ నేపథ్యంలో హీరోయిన్లు హరినాథ్ ను బాగా ఇష్టపడేవారు హీరోయిన్లు.భవిష్యత్ లో మంచి హీరోగా అవుతాడని చాలా మంది తనతో సన్నిహితంగా ఉండేవారు.ఇక్కడే హరినాథ్ ఫోకస్ తప్పింది.నటనతో పాటు సినిమాల మీద కూడా ఏకాగ్రత తప్పింది.ఆ తర్వాత మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడ్డాడు.

దీంతో ఎస్వీఆర్, హరినాథ్ స్నేహం పెరిగింది.ఇద్దరూ గొప్ప నటులు అయినా.

వ్యసనాల్లోనూ పోటీకి దిగారు.దీంతో హరినాథ్ కు అవకాశాలు తగ్గాయి.

చివరకు సంపాదించింది పోగొట్టుకుని బతకడానికే చాలా కష్టపడ్డాడు.అయితే ఎస్వీయార్ స్నేహమే తన కొంప ముంచిందంటారు చాలా మంది సినీ జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube