పొరుగింటి కూర పుల్లన.. సొంతిటి హీరోలకు సక్సెస్ ఇవ్వలేకపోతున్న పూరీ..

పూరీ జగన్నాథ్.తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.

తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ తను పలు సినిమాలను తెరకెక్కించాడు.

మాస్.

ఊర మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి సరికొత్త రూపు ఇచ్చిన వ్యక్తి తను.తన తొలి సినామ బద్రి మొదలుకొని ఇస్మార్ట్ శంకర్ వరకు ఎన్నో అద్భుత సినిమాలు తెరకెక్కించాడు.ఆయన సినిమాల్లో చాలా వరకు అద్భుతంగా పేలినవే.

అయితే పెరటి కూర పుల్లన అన్నట్లు బయటి హీరోలకు హిట్ల మీద హిట్లు ఇచ్చిన పూరీ.సొంతింటి హీరోలకు మాత్రం సరైన హిట్ ఇవ్వడంలో సక్సెస్ కాలేకపోయాడు.ఎప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ తో సినిమాలు చేసినా తను తడబడుతూ ఉంటాడు.17 సంవత్సరాల క్రితం తమ్ముడు సాయిరామ్ ని హీరోగా పెట్టి 143 తీశాడు.ఆ తర్వాత 2018లో తన తనయుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా తీశాడు.

Advertisement

ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.రవితేజ లాంటి హీరోలను స్టార్ గా మార్చిన ఆయన..పునీత్ రాజ్ కుమార్, రాంచరణ్ వంటి స్టార్ కిడ్స్ ను సూపర్ డూపర్ హీరోలా మలిచిన ఆయన సొంతింటికి వచ్చే సరికి సక్సెస్ బాట పట్టలేకపోయాడు.

తన తమ్ముడితో పాటు కొడుకును కూడా సక్సెస్ బాట పట్టించడంలో ఆయన అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

తాను సక్సెస్ కాలేకపోవడంతో తమ్ముడు, తనయుడిని సక్సెస్ బాట పట్టించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాడు.అందులో భాగంగానే తన శిష్యుడు,. డెబ్యూ డైరెక్టర్ అనిల్ పాడూరి చేతికి తన తనయుడు ఆకాష్ ను అప్పగించాడు.

తనే స్వయంగా కథ, కథనం, మాటలు, నిర్మాణ బాధ్యతలు చేపట్టి తెరకెక్కించిన రొమాంటిక్ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.ఇక ముందు పూరీ.ఆకాష్ ను ఏవిధంగా సక్సెస్ బాట పట్టిస్తాడో చూడాలి అనుకుంటున్నారు సినీ జనాలు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు