ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలలో బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.ముఖ్యంగా తమ పెళ్లిళ్ల విషయంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చాలా వరకు చాలా మంది నటీనటులు తమ ప్రేమ, పెళ్లిల విషయాలలో మాత్రమే విమర్శలు ఎదుర్కొంటారు.ఒకరిని ఇష్టపడి మరొకర్ని పెళ్లి చేసుకుంటుంటారు.
ఇక పెళ్లి జీవితంలో కూడా ఏవైనా గొడవలు జరిగితే విడిపోయి మరో పెళ్లి చేసుకుంటారు.అలా ఇప్పుడే కాదు గతంలో అలనాటి తారలు కూడా ఇలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
కొందరు నటులు మాత్రం దెబ్బలు తిన్న పరిస్థితి కూడా వచ్చింది.అందులో ఓ టాప్ హీరోయిన్ పరిస్థితి కూడా ఇలాగే జరిగింది.
ఇంతకు ఆమె ఎవరో తెలుసుకుందాం.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి అందాల నటి రేఖ.
తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.తన అందంతో మాత్రం ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.ఈమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటించింది.1958లో ఇండస్ట్రీకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.పైగా తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక ఈమె నటిగా మంచి పేరు సంపాదించుకుంది కానీ వ్యక్తిగత విషయంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొంది.ఈమెకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి అంటూ గతంలో బాగా వార్తలు వినిపించాయి.అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో ప్రేమలో కూడా పడింది.
ఇక వీరిద్దరూ కొంతకాలం కలిసి తిరిగారు.కానీ పెళ్ళి సమయం వచ్చేసరికి పెళ్లి జరగకపోయేసరికి చాలా బాధపడింది.
ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ జయ బచ్చన్ ను పెళ్లి చేసుకున్నాడు.ఇక అమితాబ్ బచ్చన్ కు రేఖ తో సంబంధం ఉన్న విషయం జయ బచ్చన్ కు తెలియటంతో ఆమె ఇప్పటికీ రేఖను విమర్శిస్తూనే ఉంటుంది.
ఇక కొంతకాలం తర్వాత మరో సినీనటుడు వినోద్ మెహ్రాను ప్రేమించింది.అతడితో కొంతకాలం ప్రేమాయణం జీవనం గడిపి ఓ రోజు పెళ్లి చేసుకొని వినోద్ వాళ్ల ఇంటికి వెళ్ళింది.

అలా పెళ్లి దండలతో అత్తారింట్లో అడుగుపెట్టిన రేఖను వినోద్ తల్లి చూసి తట్టుకోలేక పోయింది.రేఖను నానా మాటలతో తిట్టి బాగా అవమానపరిచింది.అంతేకాకుండా తన భర్త వినోద్ ముందు తనను చెప్పుతో కూడా కొట్టి బాగా దూషించింది.దీంతో రేఖ ఈ అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత కొంత కాలానికి వినోద్ నుండి విడిపోయింది.ఇక ఈ విషయం గురించి అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో బయటపడటంతో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఆ తర్వాత కొంత కాలానికి ముఖేష్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోగా అతడు కొంతకాలానికే ఆత్మహత్య చేసుకొని మరణించాడు.ఆ సమయంలో కూడా రేఖను చాలామంది అవమానించారు.