మహేష్ బాబు( Mahesh Babu ) గుంటూరు కారం ఈరోజు అన్ని థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తుంది అని అనుకుంటే సినిమా చూసిన ప్రేక్షకులు ఉసురుమంటూ బయటకు వస్తున్నారు.మహేష్ బాబు ఫ్యాన్స్ దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి.
ఎన్నో అంచనాలతో త్రివిక్రమ్ సినిమా కాబట్టి వీరి కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో చాలా హైప్ క్రియేట్ అయ్యాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం త్రివిక్రమ్ బొక్క బోల్తా పడ్డాడు.ఇప్పటికే దిల్ రాజు థియేటర్స్ ఇవ్వలేదని హనుమాన్( Hanuman ) సినిమాకి సింపతితో ఎక్కువమంది వెళ్తున్నారు.
ఆ సింపతీ కాస్త పోయి ఇప్పుడు కంటెంట్ పరంగా మార్కులు కూడా పడటంతో ఇక ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమా మాత్రమే గట్టి చిత్రంగా నిలుస్తోంది.
కేవలం ధమాకా చిత్రంతో తన స్టామినా ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చూపి వరుసగా 7, 8 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.శ్రీలీల గుంటూరు కారం( Sreeleela ) కూడా ఆమె ఖాతాలో మొదటి నుంచి ఉంది మొదట సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయిన ఈ నటి ఆ తర్వాత పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా మారింది.
ఈ సినిమాలో ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పటికే వరుస పరాజయాలు పలకరిస్తూ శ్రీ లీల ఐరన్ లెగ్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయింది.స్కంద, ఆది కేశవ తర్వాత ఒక భగవత్ కేసరి పర్వాలేదు అనిపించినా ఇప్పుడు గుంటూరు కారం కూడా పరాజయం దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి శ్రీ లీల ఖాతాలో మరో గట్టి ఫ్లాప్ చేరినట్టే.
వరుస పరాజయాల తర్వాత గుంటూరు కారం చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని శ్రీ లీల గంప ఆశలు పెట్టుకుంది.కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.పైగా ఆమె సంతకం చేస్తున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది.
ఇక ఇలాగే కొనసాగితే అతి కొద్ది రోజుల్లో శ్రీ లీల కృతి శెట్టి( Krithi Shetty ) తరహాలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోవడం ఖాయం.మరి ఈ రెండు మూడు రోజులు ఎలాగూ సంక్రాంతి సెలవులు కాబట్టి కాస్త టాక్ ఏమైనా తేడా జరిగి గుంటూరు కారం సినిమాకి వసూళ్లు వస్తే తప్ప శ్రీ లీల ఇక ముగిసిపోవడానికి దగ్గరగా చేరినట్టే.