టాలీవుడ్ లో ఇప్పుడు ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు శ్రీరెడ్డి.ఆమె హీరోయిన్ ఏ సినిమాలు చేసిందో ఎవరికీ తెలియదు కాని టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీల మీద లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు తరుచుగా పవన్ కళ్యాణ్ ని తిట్టడంతో ఆమెకి కావాల్సినంత గుర్తింపు వచ్చింది.
అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో తన ఇమేజ్ ని పెంచుకుంటూ ఉంటుంది.అయితే ఈమె చేసిన పనులకి టాలీవుడ్ లో సినిమా అవకాశాలు అయితే అసలు లేవని చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీద ఈమె ఆసక్తికరమ వ్యాఖ్యలు చేసింది.గతంలో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదని, తనకి అలాంటి అనుభవం ఎదురుకాలేదని రకుల్ చెప్పింది.
దీంతో అప్పటి నుంచి శ్రీరెడ్డి ఆమెని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.అప్పట్లో పళ్ళు రాలుతాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు వాటికి కొనసాగింపుగా ఆ రోజు చెప్పానుగా పళ్ళు రాలగొడతా అని ఇప్పుడు అన్నంత పని జరిగింది.

దేవుడు అన్ని చూస్తాడు.అందుకే తన గురించి తప్పుగా మాట్లాడిన శ్రీరెడ్డికి అవకాశాలు లేకుండా చేశాడు అంటూ పోస్ట్ పెట్టింది.అయితే ఎంత స్టార్ హీరోయిన్ అయిన ఇండస్ట్రీలో కెరియర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది.
ఆ విషయాన్ని శ్రీరెడ్డికి అర్ధం అయినట్లు లేదు అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.మరో విషయం రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.ఆ విషయం శ్రీరెడ్డికి తెలియదనుకుంట అంటూ కూడా కామెంట్స్ పెట్టారు.