కూరగాయలలో ఒకటైన సోయాచిక్కుడు పంట( Soybean Farming ) ద్వారా భూసారం పెరుగుతుంది.సోయా చిక్కుడు పంటను వర్షాధార పంటగా సాగు చేయాలనుకుంటే జూన్ నుండి జూలై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.
నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు.ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువ.
సోయా చిక్కుడు పంట కాలం 90 నుంచి 110 రోజులు.నల్లరేగడి నేలలు, తేమ ఎక్కువగా ఉండే బరువైన నేలలు సోయాచిక్కుడు పంట సాగుకు చాలా అనుకూలం.
![Telugu Agricultrue, Soybean, Soybean Seeds-Latest News - Telugu Telugu Agricultrue, Soybean, Soybean Seeds-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/Proprietary-methods-to-prevent-the-stem-peeling-insects-from-the-soybean-cropb.jpg)
ఈ పంట సాగులో అధిక దిగుబడి సాధించాలంటే విత్తన ఎంపిక( Soybean Seeds ) అత్యంత కీలకం.పాత విత్తనం అయితే మొలకశాతం తక్కువగా ఉంటుంది కాబట్టి కొత్త విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.సోయా చిక్కుడు విత్తనం విత్తే టప్పుడు నేలలో తేమ ఉండేలాగా చూసుకోవాలి.నేలలో తేమ ఉంటే విత్తనం త్వరగా మొలకెత్తుతుంది.విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే.వివిధ రకాల తెగుళ్లు ఆశించవు.ఒక కిలో విత్తనాలను 2.5 గ్రాముల థైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
![Telugu Agricultrue, Soybean, Soybean Seeds-Latest News - Telugu Telugu Agricultrue, Soybean, Soybean Seeds-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/02/These-are-the-best-type-of-seeds-that-give-high-yields-in-the-cultivation-of-Soya-bean-legumed.jpg)
ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరాకు నాలుగు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.సోయా చిక్కుడు పంటకు సెర్మోస్పోరా ఆకుమాడు తెగులు సోకితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.లేత మొక్క ఆకులపై ఊదా రంగులో మచ్చలు( Scars ) ఏర్పడి అవి క్రమంగా పసుపు రంగులోకి మారితే ఆ మొక్కకు ఈ తెగులు సోకినట్టే.
ఇక ఈ తెగులు క్రమేపి కాండం, కాయలకు వ్యాప్తి చెందుతుంది.ఈ తెగుళ్ల నివారణకు మూడు గ్రాముల మాంకోజెబ్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే ఈ తెగుళ్లు అరికట్టబడతాయి.లేదంటే ఒక లీటర్ నీటిలో ఒక గ్రాము కార్బండిజం ను కలిపి పిచికారి చేయాలి.