ఏపీ " స్లోగన్స్ " యమ ట్రెండ్ గురూ..!

రాజకీయాల్లో ఎన్నికల ముందు ఆయా పార్టీలు అందించే స్లోగన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.గత ఏపీ ఎన్నికల సమయంలో ” రావాలి జగన్.

కావాలి జగన్ ” అంటూ వైసీపీ( ycp ) అందుకున్న నినాదం ఆ పార్టీ విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే.ఇలాంటి నినాదాలు ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

గత ఎన్నికల్లో వైఎస్ జగన్ అనుసరించిన విధంగానే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కూడా స్లోగన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న ఈ ఇద్దరు అధినేతలు జగనే లక్ష్యంగా కొత్త కొత్త నినాదాలను తెరపైకి తెస్తున్నారు.

Telugu Jsp, Ap, Chandra Babu, Janasena, Pawan Kalyan, Slogans, Ys Jagan-Politics

ఇప్పటికే స్లోగన్స్ విషయంలో టీడీపీ ( TDP )కొంత ముందుంది.” సైకో పోవాలి.సైకిల్ రావాలి “, బాబు రావాలి అభివృద్ది జరగాలి.” అంటూ రకరకాల నినాదాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.టీడీపీ అందుకుంటున్న నినాదాలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది.అటు పవన్ కల్యాణ్ కూడా ” స్లోగన్స్” విషయంలో నో కంప్రమైజ్ అంటున్నారు.ఇప్పటికే జనసైనికులు ” పవన్ రావాలి.పాలన మారాలి.” అనే నినాదంతో జనసేనకు మైలేజ్ తెచ్చే పనిలో ఉన్నారు.ఇప్పుడు స్వయంగా పవనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు ” హలో ఏపీ.బై బై వైసీపీ ” అనే నినాదంతో ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు.

Telugu Jsp, Ap, Chandra Babu, Janasena, Pawan Kalyan, Slogans, Ys Jagan-Politics

దీంతో ప్రస్తుతం ” హలో ఏపీ.బై బై వైసీపీ ” అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు జనసైనికులు.అయితే స్లోగన్స్ విషయంలో ఈసారి వైసీపీ కొంత వెనుకబడిందనే చెప్పాలి.” జగనన్నే మా భవిష్యత్తు.మళ్ళీ జగన్ రావాలి.” అనే నినాదాలు వైసీపీ నేతలు చేస్తున్నప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు.అయితే ఎన్నికలకు ఇంకా 10 నెలలు టైమ్ ఉండడంతో వైసీపీ కూడా సరికొత్త స్లోగన్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.

మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రేస్ లో ఉన్న ప్రధాన పార్టీలు.గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటూ.సరికొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అన్నీ పార్టీల నేతలు.మరి ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ స్లోగన్ ప్రభావం చూపుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube