టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్ కపుల్ లో శివబాలాజీ( Shiva Balaji ) మధుమిత( Madhumita ) ఒక జోడీ కాగా పెళ్లి తర్వాత ఏడాదిన్నర పాటు గొడవలు జరిగాయని మధుమిత వెల్లడించారు.బాబు పుట్టిన తర్వాత కూడా గొడవలు జరుగుతుండటంతో కొంతకాలం పాటు డాక్టర్ సూచనల మేరకు దూరంగా ఉన్నామని శివబాలాజీ చెప్పుకొచ్చారు.
భార్యాభర్తల మధ్య గొడవలను వాళ్లు పరిష్కరించుకుంటే బాగుంటుందని శివబాలాజీ కామెంట్లు చేశారు.
ఆ గొడవలను ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుందని శివబాలాజీ అన్నారు.
విడాకులు అనేది మేమెప్పుడూ ఆప్షన్ గా అనిపించలేదని మధుమిత తెలిపారు.ఒకరిపై ఒకరికి లవ్, రెస్పెక్ట్ ఉందని మధుమిత కామెంట్లు చేశారు.
కాంబినేషన్ లో చేయాలని ఉందని మంచి స్క్రిప్ట్ వస్తే చేయడానికి అభ్యంతరం లేదని శివబాలాజీ వెల్లడించడం గమనార్హం.చిల్డ్రన్ కు ఇద్దరూ అటాచ్ అయ్యామని శివబాలాజీ, మధుమిత చెప్పుకొచ్చారు.
ఏం చేసినా ఆలోచించి చేయాలని పిల్లలకు చెబుతామని మధుమిత అన్నారు.ఇది లేదు అని అది లేదు అని ఫీల్ కామని మధుమిత వెల్లడించారు.మనుషులకు ఎక్కువగా విలువ ఇస్తున్నామని మనుషులుగా మంచిగా ఉంటున్నామని ఆమె తెలిపారు.పంచవటి కాలనీలో ఫ్లోర్( Panchavati Colony ) తీసుకున్నామని మంచి కారు ఉందని శివబాలాజీ వెల్లడించారు.
పాత కారు బాగున్నప్పుడు కొత్త కారు ఎందుకని ఆయన తెలిపారు.
నేను మనీ ఇన్వెస్టర్ అని నా భార్య మనీ సేవర్ అని ఆమె దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో కూడా నాకు తెలియదని శివబాలాజీ చెప్పుకొచ్చారు.అన్నీ అకౌంటబుల్ అని శివబాలాజీ వెల్లడించారు.నేను తనకు ఇచ్చిన డబ్బులలో ఆమె సేవ్ చేస్తుందని ఆయన కామెంట్లు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరిస్థితి బాగుందని శివబాలాజీ తెలిపారు.నటుడు శివబాలాజీ, మధుమిత కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.