2023-24కు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఈనెల అనగా మేలో మొదటి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశం జరగగా దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యంగా అన్ క్లయిమ్ డిపాజిట్లపై ఆమె మాట్లాడారు.
త్వరితగతిన బ్యాంక్ అకౌంట‍్లలో డిపాజిట్ చేసి మరిచి పోయినా, లేదంటే వివిధ కారణాల వల్ల తీసుకోలేకపోయిన ఖాతాదారులకు లేదంటే వారి కుటుంబ సభ్యులకు సదరు నగదు అందేలా చూడాలని అన్నారు.

ఈ నేపథ్యంలో బ్యాంక్కు సంబంధించిన సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల( Fixed Deposits )లో డబ్బులు దాచి మరచిపోయిన సొమ్మును లబ్ధిదారులకు అందించేలా 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేలా బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి గురించి అందరికీ తెలిసినదే.కాగా ఈ కార్యక్రమం జూన్ 1నుంచి ప్రారంభం అవుతుంది.దీంతో పలు బ్యాంక్‌లు ‘అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ ( Unclaimed deposits )’లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను ఇలా తనిఖీచేసుకోవచ్చు.ఉదాహరణకు (https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx) లింక్ ను మొదట క్లిక్ చేయాలి.ఇపుడు మీకు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ అనే సెర్చ్ బార్ కనిపిస్తుంది.అక్కడ మీ పేరు ఎంటర్ చేసి ట్యాప్ చేస్తే, మీరు ఏ బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేశారో అర్ధం అవుతుంది.
ఒకవేళ మీ అన్ క్లయిమ్డ్ డిపాజిట్లు ఉంటే బ్యాంకుల్ని సందర్శించాలి.అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని డ్రా చేసుకోవాలి.ఇందుకోసం ఆయా బ్యాంకుల నిబంధనలు పాటించాలి.







