బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan )గత సినిమా ‘పఠాన్’ ( Pathaan )తో హిట్ అందుకుని అదే ఊపులో ”జవాన్” సినిమా ఫినిష్ చేసిన విషయం విదితమే.ఈ సినిమాతో తన సక్సెస్ ను కొనసాగించాలని తహతహ లాడగా ఇప్పుడు ఆయన ప్లాన్ వర్క్ అవుట్ అయినట్టే అనిపిస్తుంది.
షారుఖ్ పఠాన్ సినిమాకు ఎలాంటి కొనసాగింపు ఇవ్వాలో సరిగ్గా అలాంటి సినిమానే ఎంచుకున్నాడు.
జవాన్ సినిమా( Jawan Movie )పై టాక్ చూస్తుంటే ఇక మాటల్లేవ్ అనే చెప్పాలి.ఎందుకంటే ఫ్యాన్స్ కు జవాన్ హ్యాంగ్ ఓవర్ దిగాలంటే చాలా గంటలు పట్టేలానే ఉంది.ఈ సినిమా చూసిన వారు చెబుతున్న రివ్యూలు చూస్తుంటే బ్లాక్ బస్టర్ అయినట్టే అనిపిస్తుంది.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు ఎమోషన్స్, ఎలివేషన్స్ మరో రేంజ్ లో ఉన్నాయని టాక్.
అట్లీ ( Atlee Kumar )సౌత్ డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నార్త్ వాళ్లకు చూపించాడు అని అంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అట్లీ డైరెక్షన్ లో వేలు పెట్టక పోవడంతో ఫైనల్ లో జవాన్ కు ఈ అవుట్ ఫుట్ అనేది వచ్చింది.ఎమోషన్, యాక్షన్ ను పెర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ కథ, కథనాలు నడిపించాడు.
అలాగే అనిరుద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.ఇలా అట్లీ మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా జవాన్ ను తీర్చి దిద్దాడు.
దీంతో ఈ టాక్ తో ఈ సినిమా 1000 కోట్లు ఈజీగానే సాధిస్తుంది అనే చెప్పాలి.పఠాన్ మాములు టాక్ వస్తేనే 1000 కోట్లు రాబట్టగా జవాన్ టాక్ చూస్తుంటే మరింత వేగంగా వసూళ్ల సునామీ సృష్టించే అవకాశం ఉంది.
మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు షారుఖ్ తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.