న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు క్లాస్ హీరోగా పిలిపించుకుంటూ వస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన నాని ఇకపై మాత్రం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు.
తన నెక్స్ట్ సినిమా సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతుంది.ఇప్పటికే నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేసారు మేకర్స్.ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.
ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంది.
![Telugu Dasara, Keerthy Suresh, Nani, Santhosh Yanan, Dasara February, Slv Cinema Telugu Dasara, Keerthy Suresh, Nani, Santhosh Yanan, Dasara February, Slv Cinema](https://telugustop.com/wp-content/uploads/2023/02/Second-single-From-Dasara-to-be-Released-on-February-13b.jpg )
అలాగే ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తానా సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.వాలెంటైన్స్ డే కానుకగా ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 13న ఈ సినిమా నుండి సెకండ్ సింగ్ ఓరి వారి పల్లవితో సాగే హార్ట్ బ్రేకింగ్ ఆంథం ను రిలీజ్ చేయనున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
![Telugu Dasara, Keerthy Suresh, Nani, Santhosh Yanan, Dasara February, Slv Cinema Telugu Dasara, Keerthy Suresh, Nani, Santhosh Yanan, Dasara February, Slv Cinema](https://telugustop.com/wp-content/uploads/2023/02/Second-single-From-Dasara-to-be-Released-on-February-13c.jpg )
మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.