ఏపీలో వైఎస్ఆర్ షాదీ తోఫా, కల్యాణమస్తు నిధులు విడుదల

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ షాదీ తోఫా, కల్యాణమస్తు పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 Ysr Shaadi Tofa And Kalyanamastu Funds Released In Ap-TeluguStop.com

ఈ మేరకు సీఎం జగన్ మొత్తం 4,536 కుటుంబాలకు రూ.38.13 కోట్లను పంపిణీ చేశారు.తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు.

లబ్ధిదారులు ఎవరూ ప్రభుత్వ సాయానికి దూరం కావొద్దనే ఉద్దేశంతో దరఖాస్తుకు జనవరి నెలాఖరూ వరకు సమయం ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు.ఈ పథకం కింద సంవత్సర కాలంలో నాలుగు సార్లు నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వం బీసీల కులాంతర వివాహాలకు రూ.50 వేలు ప్రకటిస్తే వైసీపీ ప్రభుత్వం రూ.75 వేలు అందిస్తోందని సీఎం జగన్ తెలిపారు.భవన, ఇతర కార్మికులకు గతంలో రూ.20 వేలు అందిస్తుండగా… ఇప్పుడు రూ.40 వేలు అందిస్తున్నామన్నారు.లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube