చిత్తూరు జిల్లా పుంగనూరులో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు అయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.సబ్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్యతో పాటు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో ఏడుగురు అరెస్ట్ కాగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.తన స్థలాన్ని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.కాగా ప్రస్తుతం కుప్పం సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బయ్య వారం రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.