తక్కువ పెట్టుబడితో వేల కోట్ల రూపాయలు సంపాదించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.
సక్సెస్ సాధించిన ఎంతోమంది ఆ సక్సెస్ కోసం ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు.అలా కష్టపడి తన సక్సెస్ తో సంచలనాలు సృష్టించిన వారిలో సంజీవ్ జునేజా( Sanjeev Juneja ) కూడా ఒకరు.
తన తల్లి దగ్గర 2000 రూపాయలు తీసుకుని సంజీవ్ జునేజా బిజినెస్ ను మొదలుపెట్టారు.
ప్రస్తుతం సంజీవ్ జునేజా వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు.1999 సంవత్సరంలో తండ్రిని కోల్పోయిన సంజీవ్ 2003 సంవత్సరంలో రాయల్ క్యాప్సూల్స్( Royal Capsules ) పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టాడు.ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టి 2008 సంవత్సరంలో హెయిర్ కేర్ ఫార్ములా అనే సంస్థను మొదలుపెట్టాడు.
ఈ సంస్థ తక్కువ సమయంలోనే పాపులర్ బ్రాండ్ గా ఎదిగి మంచి లాభాలను అందించింది.
ఆ బ్రాండ్ పేరు కేశ్ కింగ్( Kesh King ) కాగా తర్వాత రోజుల్లో ఇమామి( Emami ) ఈ సంస్థను 1651 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం.ఎన్నో కొత్తకొత్త ఉత్పత్తులను మార్కెట్ కు పరిచయం చేయడం ద్వారా సంజీవ్ జునేజా ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం సంజీవ్ జునేజా వేర్వేరు ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్నారు.
సంజీవ్ జునేజా బిజినెస్ మేన్ గా( Business Man ) కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.సంజీవ్ జునేజా రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ విజయాలను సొంతం చేసుకుని కెరీర్ పరంగా ఎంత ఎదుగుతారో చూడాల్సి ఉంది.సంజీవ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. తక్కువ పెట్టుబడితో ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం సంజీవ్ జునేజాకు మాత్రమే సాధ్యమైందని నెటిజన్ల నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.