ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్దితులు నెలకొన్నాయి.అలాగని ఇంటి వద్దే ఉండిపోతే పూటగడవని దుస్దితి ప్రస్తుతం నెలకొంది.
ఇక వీటికి భయపడక ధైర్యం చేసి వెళ్లితే తిరిగి క్షేమంగా ఇల్లు చేరుకుంటాం అనే నమ్మకం లేదు.ఇకపోతే తాజగా నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకే బైక్ పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
కాగా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇకపోతే ఈ ప్రమాదంలో మృతి చేందిన వారు అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.