Wedding Season : ఈ పెళ్లిళ్ల సీజన్ లో సూపర్ గ్లోయింగ్ గా మెరిసి పోవాలనుకుంటున్నారు.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

మళ్లీ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది.ఎంతో మంది కొత్త జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

 Follow This Home Remedy For Super Glowing Skin In This Marriage Season-TeluguStop.com

పెళ్లిళ్ల సీజన్( Wedding season ) లో బ్యూటీ పార్లర్స్ అసలు ఖాళీగా ఉండవు.మన ఇంట్లో పెళ్లి అయినా, బంధువుల పెళ్లి అయినా ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.

అందులో భాగంగానే బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవల్, పెడిక్యూర్, మానిక్యూర్ వంటివి చేయించుకుంటూ ఉంటారు.అయితే అందరూ బ్యూటీ పార్లర్ కు వెళ్లలేరు కదా.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని కనుక ఫాలో అయితే ఫేషియల్ కూడా అక్కర్లేదు.

అంత అందంగా, సూపర్ గ్లోయింగ్ గా మీ స్కిన్ మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు టొమాటో ముక్కలు( Tomato slices ) మరియు నాలుగు నుంచి ఐదు క్యారెట్ స్లైసెస్ ( Carrot slices )వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Facial, Skin, Season, Skin Care, Skin Care Tips-Telugu H

అలాగే నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) మరియు సరిపడా టొమాటో క్యారెట్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు కూడా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

పెళ్లికి పది రోజుల ముందు నుంచి రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం లో కొత్త మెరుపును గమనిస్తారు.

Telugu Tips, Face Pack, Facial, Skin, Season, Skin Care, Skin Care Tips-Telugu H

ఈ రెమెడీ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు మరియు మురికిని పూర్తిగా తొలగిస్తుంది.చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.ఏమైనా మొండి మొటిమలు.

మచ్చలు ఉంటే క్రమంగా వాటిని మాయం చేస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ సూపర్ సాఫ్ట్ గా మరియు గ్లోయింగ్ గా తయారవుతుంది.

ఈ పెళ్లిళ్ల సీజన్లో సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించే వారికి పర్ఫెక్ట్ రెమెడీ ఇది.కాబట్టి తప్పక ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube