Diabetes : మధుమేహులు ఈ సూపర్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ ఇక మీ కంట్రోల్ లో ఉన్నట్లే!

ప్రతి ఏడాది మధుమేహం( diabetes ) బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం, ఊబకాయం తదితర కారణాల వల్ల వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మధుమేహానికి గురవుతున్నారు.

 Super Foods For Diabetic Patient-TeluguStop.com

దీంతో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం అంటే మధుమేహులకు కత్తి మీద సాములా మారింది.ఏది తినాలన్నా ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో అని భయపడుతూ ఉంటారు.

నిజానికి కొన్ని కొన్ని ఆహారాలు రక్తంలోని చక్కెర స్థాయిలను ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేయగలవు.అటువంటి సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిరుధాన్యాలు( millets ).మధుమేహం ఉన్నవారికి ఒక వరం అని చెప్పుకోవచ్చు.చిరుధాన్యాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ( Glycemic index )తక్కువగా ఉంటుంది.అందువల్ల వాటిని డైట్ లో చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి.అలాగే మధుమేహులు గ్రీన్ టీ ని డైట్ లో కనుక చేర్చుకుంటే షుగర్ లెవెల్స్ మీ కంట్రోల్ లో ఉన్నట్లే.అవును రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడానికి గ్రీన్ టీ ( Green tea )ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ తో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.

Telugu Apple, Diabetes, Greenleafy, Green Tea, Tips, Latest, Millets, Sugar Leve

మధుమేహం తో బాధపడుతున్న వారు రెగ్యులర్ గా ఏదో ఒక ఆకుకూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఆకుకూరల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా అది అడ్డుకుంటుంది.

మధుమేహం ఉన్న‌వారు ఫ్రూట్స్ తినకూడదని అనుకుంటారు.కానీ అది అన్ని రకాల పండ్లకు వర్తించదు.

నిజానికి మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల ఇన్సులిన్ తగ్గుతుందని నిరూపించబడింది.కాబట్టి మీరు నిశ్చింతగా రోజుకు ఒక యాపిల్ పండును( apple fruit) తినొచ్చు.

Telugu Apple, Diabetes, Greenleafy, Green Tea, Tips, Latest, Millets, Sugar Leve

అలాగే షుగర్ వ్యాధిని తగ్గించే గుణాలు జీలకర్రకు ఉంది.అందువల్ల నిత్యం జీలకర్రను తగిన మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపు తప్పకుండా ఉంటాయి.ఇక దాల్చిన చెక్క( Cinnamon ) కూడా మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.వారానికి కనీసం మూడు నాలుగు సార్లు అయినా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తీసుకోండి.

ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు, క్యాన్సర్, ఊబ‌కాయం వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube