నింద మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించిన తాజా చిత్రం నింద.( Nindha Movie ) ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించారు రాజేష్.

 Varun Sandesh Nindha Movie Review And Rating Details, Nindha Movie, Varun Sandes-TeluguStop.com

ఈ సినిమాలో హీరో వరుణ్ సందేశ్( Varun Sandesh ) మెయిన్ లీడ్ లో నటించిన విషయం తెలిసిందే.ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది?అసలు కథ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.

కథ :

బాలరాజుకు మంజు ని రేప్ అండ్ మర్డర్ చేశారన్న కేసులో ఉరి శిక్ష పడుతుంది.కానీ ఆ శిక్ష వేసిన జడ్జ్ కి మాత్రం అతను తప్పు చేయలేదని అపిస్తుంది.కానీ ఆ కేసులో ఉన్న సాక్షదారాలు అన్నీ కూడా పరిశీలిస్తే బాలరాజు( Balaraju ) నేరస్తుడు అని చెబుతాయి.

దాంతో జడ్జి బాలరాజుకు ఉరిశిక్ష విధిస్తాడు.ఇక ఆ జడ్జ్ కొడుకు వివేక్(వరుణ్ సందేశ్) మానవ హక్కుల కమిషన్‌లో పని చేస్తుంటాడు.

ఈ కేసు గురించి చెప్పడంతో అసలు నేరస్థుడి ని పట్టుకునేందుకు బయల్దేరుతాడు.వివేక్( Vivek ) చేసిన ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అసలు నేరస్థుడిని కనిపెడతాడా? అసలు నిందితుడు ఎవరు? బాలరాజుకు శిక్ష పడుతుందా? ఈ కేసు వెనకాలున్న అసలు కోణం ఏంటో తెలుసుకుంటాడా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Telugu Ninda, Ninda Review, Nindha, Nindha Story, Tollywood, Varun Sandesh-Movie

నటీనటులు :

వరుణ్ సందేశ్ ఇలాంటి పాతలు నటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.అయినా కూడా వరుణ్ సందేశ్ సీరియస్ పాత్రలో చాలా బాగా నటించాడు.సినిమాలో వివేక్ పాత్రకు బాగా సరిపోయాడు వరుణ్ సందేశ్.ఇక బాలరాజుగా ఛత్రపతి శేఖర్( Chatrapati Shekar ) తన అనుభవాన్ని చూపించాడు.క్యూ మధు, అన్నీ, శ్రేయ రాణి పాత్రలు బాగుంటాయి.జడ్జ్‌గా తనికెళ్ల భరణి, మైమ్ మధు ఇలా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.

Telugu Ninda, Ninda Review, Nindha, Nindha Story, Tollywood, Varun Sandesh-Movie

విశ్లేషణ :

కాగా కాండ్రకోట మిస్టరీ బేస్డ్ యధార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం అని చెబుతూనే సినిమాపై హైప్ ని పెంచుతూ వచ్చారు.దానికి తోడు సినిమా విడుదలకు ముందే విడుదల చేసిన ట్రైలర్లు టీజర్ లో సినిమాపై అంచనాలను కాస్త మరింత పెంచాయి.నింద మూవీకి రిలీజ్ కంటే ముందే పాజిటివ్ వైబ్ ఏర్పడింది.అలాగే వరుణ్ సందేశ్ కూడా కొత్త పాత్రలో నటిస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపించారు.ఆ పాజిటివ్ వైబ్ సినిమాలోనూ కనిపించింది.సినిమా ప్రారంభం కాస్త స్లోగా అనిపిస్తుంది కానీ నెమ్మదిగా పుంజుకుంటుంది.

అయితే పాయింట్ పాతదే అయినప్పటికీ కొత్తదనంతో చూపించాడు డైరెక్టర్.ఫస్టాఫ్ అంతా కూడా బాగానే ఉంది.

అక్కడక్కడ కాస్త బోరింగ్ గా అనిపించవచ్చు.ఇంటర్వెల్స్ ని కూడా బాగానే ఉంది.

తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదు అనే పాయింట్‌ను డైరెక్టర్ బాగానే అల్లుకున్నాడు.

Telugu Ninda, Ninda Review, Nindha, Nindha Story, Tollywood, Varun Sandesh-Movie

టెక్నికల్‌ :

ఇందులో విజువల్స్ బాగుంటాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది.ఇందులో పాటలు కూడా బాగున్నాయి.

స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉంటుంది.కొత్త నిర్మాణ సంస్థ అయినా కూడా మొదటి సినిమాను చాలా అద్భుతంగా నిర్మించారు.

రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube