ఎప్పుడైనా నిర్మాతకు సినిమాపై మంచి పట్టు ఉండాలి.తీసే టెక్నీషియన్స్ అలాగే నటీనటులతో కూడా ఆయనకు సమన్వయం ఉండాలి.
అప్పుడే మంచి సినిమాలు ప్రేక్షకులకు అందుతాయి.కేవలం డబ్బు ఉంది కాబట్టి పెట్టుబడి పెడతాను అంటే కుదరదు నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటే సినిమా అంత బాగా వస్తుంది.
అలా ఒక మంచి సినిమా తీయాలి అనుకున్నప్పుడు నిర్మాత రుద్రరాజు సీతారామరాజు గారు( Producer Rudraraju Sitaramaraju ) తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి మీడియాతో పంచుకున్నారు ఆయన 1999లో ఆవిడే శ్యామల సినిమా( Aavide Shyamala Movie ) తీయాలనుకున్నారు ఈ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇందులో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ చాలా చక్కగా నటించారు ఇది అప్పట్లో మంచి విజయాన్ని కూడా అందుకుంది రుద్రరాజు సీతారామరాజు సావిత్రి వంటి వారితో సినిమాలు తీసిన అనుభవం ఉన్న నిర్మాత.
ఇక మలయాళం లో ఒక సినిమా హిట్ అయితే దానిని ఆవిడే శ్యామల పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఈ సినిమాకి దర్శకుడిగా కోడి రామకృష్ణ గాని ముత్యాల సుబ్బయ్య లాంటివారైతే బాగుంటుంది అని నిర్మాత అనుకున్నారు అయితే ముత్యాల సుబ్బయ్య( Muthyala Subbaiah ) అప్పటికే వేరే సినిమాతో బిజీగా ఉన్నారు.కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) కూడా దేవిపుత్రుడు చేస్తున్నాడు అయినా కూడా ఈ సినిమా కథ చెప్పి ఆయనను కన్విన్స్ చేశాడు నిర్మాత.అలా ఈ సినిమా షూటింగ్ మొదలైంది ఇందులోకి అద్భుతమైన పాత్ర ఉంటుంది దానికోసం తనికెళ్ల భరణి( Tanikella Bharani ) అయితే బాగుంటుంది అని నిర్మాతకు సూచించారు కోడి రామకృష్ణ.
భరణి గారికి నిర్మాతకు మంచి స్నేహం ఉండడంతో ఆయన కూడా అడగగానే భరణి గారు ఒప్పుకున్నారు.రెండు రోజులపాటు కాల్ షీట్ ఇవ్వండి డబ్బు ఎంత కావాలి అని నిర్మాత అడగగా నేను తీసుకుంటా లేండి అని అప్పుడు దాటవేశారు.
సినిమా షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ చెప్పే సమయం వచ్చింది ఒకసారి డబ్బింగ్ చెబితే నటుడుతో సినిమాకి సంబంధం ఉండదు.అందుకే మీరు అప్పుడు అడ్వాన్స్ తీసుకోలేదు ఇప్పుడైనా మీ పారితోషకం చెప్పండి అంటే నేను కేవలం అతిథి పాత్ర మాత్రమే చేశాను ఎవరైనా ఆ అతిథికి డబ్బిస్తారా మీ డబ్బు వద్దు నేను డబ్బింగ్ పూర్తిచేసుకుని వెళ్లిపోతాను అని భరణి చెప్పడంతో నిర్మాత అవాక్కయ్యారు.ఎంత వాగ్వాదం జరిగినా కూడా భరణి గారు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు చివరికి ఎంతో కొంత జేబులో పెట్టేసి అక్కడి నుంచి నిర్మాత వెళ్ళిపోయారట.అలాంటి ఒక నటుడు ఉండబట్టే ఈ సినిమా పరిశ్రమ ఇంత పచ్చగా పది కాలాలపాటు ఉండగలుగుతుంది.
పది సినిమాలు నిర్మించే అవకాశం కూడా మాలాంటి నిర్మాతలకు దొరుకుతుంది అంటూ రుద్రరాజు సీతారామరాజు గారు చెప్పుకొచ్చారు.